తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్​పై దాడి - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - Attack On Junior Doctor In Gandhi - ATTACK ON JUNIOR DOCTOR IN GANDHI

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 7:54 PM IST

Attack On Junior Doctor In Gandhi Hospital : క్లిష్టమైన సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లపై దాడి ఘటన మరోసారి తీవ్ర కలకలం సృష్టించింది. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై దాడి జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువు దాడికి పాల్పడ్డాడు. అప్రాన్‌ లాగి డాక్టర్​పై దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది ఆమెను కాపాడారు. దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి.

పోలీసులు వెంటనే నిందితుడ్ని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రోగి బంధువు దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత నిరంతరం పనిచేసే వైద్యులకు రక్షణ లేదంటూ డాక్టర్లు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details