ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY SESSION LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 9:06 AM IST

Updated : Nov 22, 2024, 3:15 PM IST

AP Assembly Session Live : పదవ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమ్యయాయి. నిన్న జరిగిన అసెంబ్లీలో (AP Assembly session) సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు (Ayyannapatrudu Chintakayala) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయడుకు (Nimmala Rama Naidu) శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి, హంద్రీనీవా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్‌ ప్రశ్నించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Nov 22, 2024, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details