ప్రారంభమైన టెట్ పరీక్ష - మార్చి 6వ తేదీ వరకు - AP TET Exam Dates
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 12:22 PM IST
AP TET Exam: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు మంగళవారం నుంచి మార్చి 6 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ పరీక్షలకు 2 లక్షల 67, 559 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో 3 పరీక్షా కేంద్రాలు, కర్ణాటకలో 3, తమిళనాడులో 2, ఒడిశాలో 2 చొప్పున పరీక్ష కోసం సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
AP TET Exam Dates దివ్యాంగ అభ్యర్థులు పరీక్ష రాయడానికి వీలుగా స్క్రైబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గర్భిణులు సమీప పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసుకోవడానికి వెసులుబాటు కల్పించామని సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాలపై ఏవైనా సందేహలుంటే అభ్యర్థులు సంబంధిత జిల్లా విద్యా శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించిన సంగతి తెలిసిందే.