ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పూజారిపై దాడి ని ఖండించిన శ్రీనివాసానందసరస్వతి - Saraswati Fires on YSRCP - SARASWATI FIRES ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 6:58 PM IST

Srinivasananda Saraswati Fires on YSRCP Leader Attack on Priest in Kakinada : కాకినాడ ఘటన ముమ్మాటికీ హిందూ ధర్మంపై జరిగిన దాడేనని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి అన్నారు. పూజారులపై దాడి చేసి హిందూ సమాజాన్ని అవమానపరిచారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో దేవుళ్లు, ఆలయ (Temple) భూములకే రక్షణ లేదనుకుంటే ఇప్పుడు ఏకంగా అర్చకులపైనా (Priest) ప్రతాపం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు రాక్షస పాలనను గుర్తు చేస్తున్నారని మళ్లీ వైఎస్సార్సీపీకి (YSRCP) అధికారమిస్తే అర్చకులకు మనుగడే లేకుండా చేస్తారని అన్నారు.
Srinivasananda Saraswati  Comments on YSRCP Leader : అభిషేకం సరిగా చేయలేదని వైఎస్సార్సీపీ నేత ఓ పూజారిని కాలితో తన్ని, దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత హేయమైన రాక్షస చర్యను ఖడిస్తున్నామని శ్రీనివాసనంద సరస్వతి ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details