ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్- రిజల్ట్స్ చూసుకోండిలా - AP Inter First Year Supply Results - AP INTER FIRST YEAR SUPPLY RESULTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 8:01 PM IST
AP Inter First Year Supply Results Released: రాష్ట్రంలో విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు సుమారు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో విద్యాశాఖ ఇవాళ ఫలితాలను విడుదల చేసింది. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
"ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాను. విద్యార్థులు తమ ఫలితాలు resultsbie.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." - మంత్రి లోకేశ్ ట్వీట్