LIVE ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం - AP EAPCET 2024 Result - AP EAPCET 2024 RESULT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 4:04 PM IST
|Updated : Jun 11, 2024, 4:22 PM IST
AP EAPCET 2024 results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) విడుదలకు అధికారులు సిద్దమైయ్యారు. ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన ఉన్నత విద్యామండలి అధికారులు.. వీటిపై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకుగాను పరీక్షలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం నేడు ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారంలో చూద్దాం..
Last Updated : Jun 11, 2024, 4:22 PM IST