ALLU ARJUN BAIL: సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు అయింది. డిసెంబర్ 4న సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో కొద్ది రోజుల క్రితమే ఇరువైపులా వాదనలు ముగియగా ఈరోజు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ‘పుష్ప2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్‌కు షరతులు: అల్లు అర్జున్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఆదేశాలలో పేర్కొంది.
నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
సంధ్య థియేటర్ ఘటనలో కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి పోలీసులు అల్లు అర్జున్‌ను దాదాపు మూడున్నర గంటలకు పైగా ప్రశ్నించారు.
Allu Arjun Reaction: ఈ ఘటనపై అల్లు అర్జున్ సైతం పలుమార్లు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తాను ఎలాంటి ర్యాలీ చేయలేదని థియేటర్ కొద్ది దూరంలో కారు ఆగిపోవడంతో, ముందుకు కదల్లేని పరిస్థితిలో చేయి చూపిస్తూ ముందుకు కదలండని అన్నానని చెప్పుకొచ్చారు.
ఇదీ జరిగింది: 'పుష్ప 2’ మూవీ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. అనే విధంగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.