Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
AP Assembly Sessions Live : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజైన నేడు ప్రభుత్వం రెండు బిల్లులను సభలో ప్రవేశ పెట్టనుంది. న్యాయాధికారుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచేందుకు తెచ్చిన చట్ట సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ డ్యూటీ సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెడతారు. వరసగా మూడో రోజూ బడ్జెట్‌పై సభలో చర్చ కొనసాగనుంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 వార్షిక పద్దుపై నేడు సభలో సమాధానం ఇవ్వనున్నారు. శాసనమండలిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేయనున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఆహారశుద్ధి, ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల స్థాపనపై మంత్రి టి.జి భరత్ ప్రకటన చేస్తారు. పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తులను కూడా అనుమతిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం అందరికి తెలిసిందే 2024-25 వార్షిక బడ్జెట్‌పై నేడు మండలిలో చర్చ ముగియనుంది.