LIVE : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP ASSEMBLY SESSIONS 2024 LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2024, 9:38 AM IST
|Updated : Nov 13, 2024, 4:57 PM IST
AP Assembly Sessions 2024 on Budget Live : అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభయ్యాయి. మూడు కీలక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో సవరణ చేయనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదిక సైతం సభ్యులకు అందజేయనున్నారు. వీటితో పాటు వార్షిక బడ్జెట్‌పై నేడు సభలో చర్చ జరగనుంది.AP Budget 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ (AP Budget 2024) ప్రవేశపెట్టింది. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పునరుజ్జీవం పోయడమే లక్ష్యమని ప్రకటించింది. సరళమైన ప్రభుత్వం ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తామని ఉద్ఘాటించింది.
Last Updated : Nov 13, 2024, 4:57 PM IST