"బుడమేరును ఆధునికీకరిస్తాం - ఆక్రమణలపై తప్పకుండా ఉక్కుపాదం మోపుతాం" - CM Chandrababu On Vijayawada Floods
Published : Sep 5, 2024, 5:12 PM IST
AP CM Chandrababu Naidu Interview On Vijayawada Floods : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సహా కృష్ణా జిల్లాలో వరదను అదుపు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడకు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అదేమాదిరిగా అక్కడ నీళ్లు సిటీలోకి రాకుండా డైవర్సన్ ఏదైతే ఉందో కొల్లేరు, కృష్ణా నదిలోకి ప్రవేశించేట్టు చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బుడమేరు పరిధిలో నెలకొన్న ఆక్రమణలపై సైతం ఉక్కుపాదం మోపి, ఆ దిశగా ఏవైనా తప్పులు జరుగుంటే చర్యలకు వెనుకాడబోమని స్పష్టంచేశారు.
మళ్లీ విజయవాడ సిటీ ఎక్కడా కూడా ముంపునకు గురికాకుండా పూర్తిగా బుడమేరును ఆధునీకరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలోనే గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. బుడమేరులో వరద తగ్గినందున అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. బుడమేరు ఆధునికీకరణ, వరద సహాయచర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.