ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర- పెద్ద ఎత్తున స్థానికుల స్వాగతాలు - AMARAVATI FARMERS PADAYATRA - AMARAVATI FARMERS PADAYATRA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 12:43 PM IST

Amaravati Farmers Padayatra in 2nd Day: రాజధాని రైతుల తిరుమల పాదయాత్ర రెండో రోజూ కొనసాగుతోంది. అమరావతి ఆంకాంక్ష నెరవేరడంతో వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం నుంచి ప్రారంభించి మొదటి రోజు తుళ్లూరు మండలం పెదపరిమి వరకు పాదయాత్ర చేశారు. ఇవాళ పెదపరిమి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. తాడికొండ చేరుకున్న మహిళా రైతులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రజలు ఓట్ల రూపంలో ఇచ్చిన తీర్పుతో రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని రాజధాని రైతులు తెలిపారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు, అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరటంతో రైతులు ఈ కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు. అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షిస్తూ తిరుమల సన్నిధికి బయలుదేరారు. స్వామివారికి మొక్కు చెల్లించుకోవటంతో పాటు గతంలో తాము పాదయాత్ర చేసిన సమయంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతామని రైతులు అంటున్నారు. రైతుల పాదయాత్ర ఇవాళ గుంటూరు వరకూ సాగనుంది. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభం కావటంపై రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details