LIVE :హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ - AI Global Summit in Hyderabad LIVE - AI GLOBAL SUMMIT IN HYDERABAD LIVE
Published : Sep 5, 2024, 10:59 AM IST
|Updated : Sep 5, 2024, 12:13 PM IST
AI Global Summit in Hyderabad LIVE : ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. నేడు, రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ సదస్సును ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేథ రంగంలో పేరొందిన ప్రముఖులు వివిధ సంస్థల ప్రతినిధులు 2 వేల మంది ఈ సదస్సు లో పాల్గొన్నారు. ఈ తరహా ఏఐ సదస్సును దేశంలో తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. సమాజంపై ఏఐ ప్రభావం నియంత్రణ, సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు.ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.
Last Updated : Sep 5, 2024, 12:13 PM IST