తెలంగాణ

telangana

ETV Bharat / videos

కోట్ల మందికి మార్గదర్శకుడు రామోజీ : సాయికుమార్ - ACTOR SAIKUMAR ABOUT RAMOJI RAO DEMISE - ACTOR SAIKUMAR ABOUT RAMOJI RAO DEMISE

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 3:03 PM IST

Updated : Jun 8, 2024, 3:17 PM IST

Hero Saikumar Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ పిల్శ్​సిటీలో రామోజీరావు పార్థివదేహానికి సినీ నటుడు సాయి కుమార్, ఆది, జబర్దస్త్ నటులు నివాళులు అర్పించారు. రామోజీరావు లేరన్న వార్త ఎంతో బాధ కలిగిస్తోందని సాయి కుమార్ అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని నష్టమని పేర్కొన్నారు. తన తండ్రి పీజే శర్మతో రామోజీరావుతో మొదలైన అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. తమకు అన్ని విషయాల్లో రామోజీరావు సలహాలు ఇచ్చేవారని సాయికుమార్ గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు కోట్ల మందిలో సామాన్యుడు ఇప్పుడు కోట్ల మందికి మార్గదర్శకుడయ్యాడని అన్నారు. తన షోలు అన్నీ బాగుండేవని ఆయన ఎప్పుడూ చెప్పేవాడని గుర్తుచేసుకుంటూ సాయికుమార్ భావోద్వేగానికి గురయ్యారు. 

రామోజీరావు మరణవార్త విన్న సినీలోకం శోకసంద్రంలో మునిగింది. ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహం వద్ద చేరి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించారు. మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నరేశ్‌, కల్యాణ్‌రామ్‌, సాయికుమార్‌, గోపీచంద్, శ్రీను వైట్ల, మ్యూజిక్​ డైరెక్టర్ ఇళయరాజా, గీత రచయిత చంద్రబోస్, గాయకుడు ఎస్​పీ చరణ్​ తదితరులు నివాళులర్పించారు.

Last Updated : Jun 8, 2024, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details