తెలంగాణ

telangana

ETV Bharat / videos

'రూ.3 లక్షలిస్తే నీ ల్యాండ్​ ప్రాబ్లమ్​ సెటిల్​ చేస్తాం' - ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్సై - Kushaiguda Police SHO Caught by ACB - KUSHAIGUDA POLICE SHO CAUGHT BY ACB

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 6:38 PM IST

ACB Raids in Kushaiguda Police Station : నగరంలోని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భూ వివాదం కేసులో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా, ఇన్‌స్పెక్టర్‌ వీరస్వామి, ఎస్సై షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లను పక్కా సమాచారంతో రైడ్ చేసి మరీ అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు పోలీస్​ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు కొనసాగాయి.

ACB Arrested to Kushaiguda CI Veeraswamy, SI Shapi : ఓ ల్యాండ్​ వివాదం పరిష్కారం కోసం పోలీస్ అధికారులు, మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతడి ద్వారా కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డిని రూ.3 లక్షల లంచం డిమాండ్‌ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపైనా దృష్టి సారించారు. గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details