ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం సభా ప్రాంగణంలో ఆందోళనకు దిగిన మహిళ - న్యాయం చేయాలని వేడుకోలు - Women Agitation IN Anakapalle

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 10:41 PM IST

Women Agitation in CM Jagan Anakapalle Sabha : సీఎం జగన్‌ అనకాపల్లి సభలో ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలసి ఆందోళనకు దిగారు. తమ కుమారుడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం జగన్‌కు తమ గోడును వెళ్లబోసుకునేందుకు సభాప్రాంగణానికి వస్తే అధికారులు అనుమతించలేదని మృతుడి తల్లి, కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాడి ఫిబ్రవరిలో తన కుమారుడు రవితేజను హత్య చేశారని అనుమానితుల పేర్లు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని చోడవరానికి చెందిన మృతుడి తల్లి కృపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ, చిన్న గొడవ కారణంగా తన కొడుకుని చంపేసి రొడ్డుపై పడేశారన్నారు. కానీ దాన్నీ యాక్సిడెంట్​గా చిత్రీకరించి తనని అక్కడికి తీసుకెళ్లారని తెలిపారు. కానీ అది ప్రమాదం కాదు. కుమారుడి ఒంటిమీద తీవ్రంగా గాయలున్నాయని తల్లి నిర్థరించుకుంది. వెంటనే పోలీసులకు ఉన్న విషయం వివరిస్తే, చివరికి తననే బెదిరించి అది యాక్సిండెం​టేనని చెబుతున్నారు. ఉన్న ఒక్క కొడుకుని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి న్యాయం కోసం వెళితే అధికారులు, పోలీసులు స్పందించటం లేదని మండిపడ్డారు. తన భర్త పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడే క్యాన్సర్ వ్యాధితో చనిపోయారని తెలిపారు. పంచాయితీలో స్వీపర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. న్యాయం కోసం పోరాడుతుంటే చేసిన పనికి జీతం ఇవ్వకుండా అధికారులు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కన్నీరు పెడుతూ తన బాధను వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details