తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రాణం తీసిన మద్యం, అతివేగం - వీడియో వైరల్ - Car Accident at Jeedimetla - CAR ACCIDENT AT JEEDIMETLA

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 3:10 PM IST

Car Accident at Jeedimetla : హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీసుస్టేషన్‌ పరిధి గాజులరామారంలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన యువకులు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ యువకులు కారుతో ఢీ కొట్టారు. కారు వేగానికి విద్యుత్‌స్తంభం విరగడమే కాక అక్కడికక్కడే పాదచారి గోపి మృతి చెందారు. కారుతో ఢీకొట్టిన యువకులు కనీస కనికరం లేకుండా వ్యవహరించారు. కారు ఢీకొనడం వల్ల చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కనీసం పట్టించుకోకుండా అమానవీయంగా ప్రవర్తించారు. 

ప్రమాదం జరిగిన తర్వాత ప్రజలు అక్కడ ఎవరూ గుమిగూడకముందుకే అక్కడి నుంచి పరారయ్యారు. కానీ డ్రైవింగ్ చేసిన వ్యక్తి మాత్రం అందులో ఇరుక్కుపోయాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని బయటకు తీసి ఎటుపారిపోకుండా పట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details