తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సులో బానెట్ గొడవ - కండక్టర్​పై మహిళ ప్రతాపం - ఠాణాలో పరస్పర ఫిర్యాదులు - WOMAN FIGHTS WITH RTC CONDUCTOR - WOMAN FIGHTS WITH RTC CONDUCTOR

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 10:24 AM IST

Woman Fights With RTC Conductor in Hanamkonda : ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు, కండక్టర్​కు మధ్య జరిగిన వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. కాగా డ్రైవర్​ పక్కనున్న బానెట్​పై మహిళ కూర్చుంటే కండక్టర్​ వారించడమే ఈ వివాదానికి కారణమని సమాచారం. పోలీస్​ స్టేషన్​లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.   

ఇదీ జరిగింది :  హనుమకొండ నుంచి ములుగు జిల్లాకు వెళ్తున్న బస్సులో కమలపూర్​కు చెందిన మహిళ ప్రయాణించింది. ఈ క్రమంలో ఆత్మకూరు శివారులో డ్రైవర్​ పక్కన బానెట్​పై కూర్చోవడానికి ప్రయాణికురాలు యత్నించింది. దీంతో బానెట్​పై కూర్చోవద్దని మహిళను కండక్టర్​ వారించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. 

ఆత్మకూరులో జాతీయ రహదారి పక్కనే ఉన్న పోలీస్​ స్టేషన్​కు వెళ్లి తనపై కండక్టర్​ చేయిచేసుకున్నాడని ప్రయాణికురాలు లలిత ఫిర్యాదు చేసింది. మరోవైపు తనను తీవ్ర పదజాలంతో దూషించారని కండక్టర్​ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తామని సీఐ నచ్చచెప్పి వారిద్దరినీ పంపించారు. బస్సు ఏటూరునాగారం వైపు వెళ్తుండగా లలిత, తన కుమారుడు మోహన్​తో కలిసి బస్సును వెంబడించారు. మల్లంపల్లి వద్ద బస్సు ఆపి కండక్టర్ పై లలిత కుమారుడు మోహన్ దాడి చేశారు. దీంతో కండక్టర్, బస్సు డ్రైవర్ ములుగు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details