ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

క్షణాల వ్యవధిలో​ వరద - చిక్కుకున్న 150 గొర్రెలు, ఇద్దరు కాపర్లు - Herdsmen Stuck in flood Waters

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 2:25 PM IST

150 sheep and Two Herdsmen Stuck in flood Waters in Panladu District : పల్నాడు జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అచ్చంపేట మండలం చామర్రు కృష్ణానది లంకభూముల్లో 150 గొర్రెలు సహా ఇద్దరు గొర్రెల కాపర్లు వరద నీటిలో చిక్కుకున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్​కు భారీగా వరద చేరుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్​ 14 గేట్లు ఎత్తారు. దీంతో ఒక్కసారిగా కృష్టానది లంకభూములను వరద నీరు చుట్టుముట్టింది. గొర్రెలు మేపడానికి వెళ్లిన కాపర్లు వరద నీటిలో చిక్కుకున్నారు. 

అకస్మాత్తుగా వరదనీరు చుట్టుముట్టడంతో గొర్రె కాపర్లు ఎటు కదలేని పరిస్థితుల్లో అయోమయంలో పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. గొర్రెల కాపర్లును రక్షించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని, గొర్రెలను సురక్షితంగా తమ ప్రాంతంకు చేర్చడానికి ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details