COW RESCUED FROM WELL: ఓ ఆవు ఆరు గంటల పాటు ప్రత్యక్ష నరకం చూసింది. మేత కోసం చేనుకొచ్చిన ఆవు ప్రమాదవశాత్తు ఓ పాత బావిలో పడిపోయింది. ఈ సమయంలో ఆవు నిటారుగా కూరుకుపోయింది. దీంతో బయటికొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. బావి ఇరుకుగా ఉండటంతో ఆవు బయటకు వచ్చేందుకు ఏమాత్రం వీలు కాలేదు. అయినా కూడా తన పోరాటాన్ని ఆపలేదు. శక్తినంతా కూడగట్టుకుని ప్రతి క్షణం మృత్యువుతో పోరాడింది. పట్టుసడలని పోరాట పటిమే ఆ మూగజీవి ప్రాణాన్ని నిలిపింది.
ఆహారం కోసం వచ్చి నదిలో చిక్కుకున్న ఏనుగు- గంటపాటు అవస్థలు - Elephant stuck in river
చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం దిగువపల్లె పంచాయతీ అప్పినేపల్లె శివార్లలో ఒకచోట పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ఆ పిచ్చిమొక్కల మధ్యలో ఓ పురాతనమైన నుయ్యి ఉంది. అదే గ్రామంలో ఉంటున్న చంద్రా అనే వ్యక్తికి చెందిన పాడి ఆవు అక్కడకి మేతకి వెళ్లింది. మేత మేస్తుండగా, ఒక్కసారిగా దాని వెనుక కాళ్లు నూతిలోకి జారిపోయాయి.
30 అడుగుల బావిలో పడ్డ గున్న ఏనుగు- రాత్రంతా అలానే! - Elephant Fell Into 30 Foot Well
దీంతో ఇరుకైన బావిలో ఊపిరాడక కనుగుడ్లు తేలిన దైన్యంతో అడుగంటుతున్న ఆశలతో ప్రాణం కోసం పోరాడింది. ప్రతి క్షణం మృత్యువుతో పోరాడుతూ, ఊపిరి ఎగబీలుస్తూ దీనంగా వేచి చూసింది. ఆవు చేస్తోన్న శబ్దం విని వెంటనే యజమాని కేకలు వేశారు. అక్కడే ఉన్న ఆ గ్రామ సర్పంచి భర్త వెంకటరెడ్డి, గ్రామస్థులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పొక్లయిన్‌ను తెప్పించి, బావి చూట్టూ మట్టిని తీశారు. అలా బావిని వెడల్పు చేస్తూ వచ్చారు. దాదాపు ఆరు గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆవుకి పునర్జన్మని ప్రసాదించారు.
ప్రపంచంలోనే అతి చిన్న ఆవు- 'బంగారు' పాలను ఇస్తుందట! చూసేందుకు ప్రజలు క్యూ - WORLD SMALLEST COW