ETV Bharat / state

పోలవరం ఎత్తుపై రాజ్యసభలో చర్చ - ఆ విషయంలో తగ్గేదేలేదని వెల్లడి - RAJ BHUSHAN CLARITY ON POLAVARAM

రాజ్యసభలో పోలవరంపై ప్రశ్నించిన వైవీ సుబ్బారెడ్డి - ప్రాజెక్టు ఎత్తు విషయంలో తగ్గేదేలేదని కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ వెల్లడి

Union Minister Raj Bhushan Clarity on Polavaram Project Height
Union Minister Raj Bhushan Clarity on Polavaram Project Height (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2024, 9:41 AM IST

Union Minister Raj Bhushan Clarity on Polavaram Project Height : పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోతున్నారనే వైఎస్సార్సీపీ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. అలాంటి ఉద్దేశం ఏమీ లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి సమాధానం ఇచ్చారు.

MP YV Subba Reddy on Polavaram Height : పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించబోమని రాజ్‌భూషణ్‌ అన్నారు. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డు-1980 (Godavari Water Dispute Tribunal Award-1980) ప్రకారం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని 45.72 మీటర్ల మేర నిలిపేలా నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. "కేంద్రం పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను 41.5 మీటర్లకు తగ్గించిన మాట వాస్తవనా? ఇందుకు రూ.30,436 కోట్ల మేర ఆమోదం తెలపడం నిజమేనా? నీటి నిల్వ సామర్థ్యాన్ని 45.72 మీటర్లకు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇది వరకు ప్రతిపాదనలు పంపిందా? అలాగే అంచనాలను సవరించాలని కోరిందా? అలాగైతే నీటి నిల్వసామర్థ్యాన్ని తగ్గించడానికి, 55 వేల657 కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించడానికి కారణమేంటి?" అని సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు రాజ్‌భూషణ్‌ సమాధానం ఇచ్చారు.

పోలవరం పనుల పురోగతిపై వెబ్​సైట్ - సాగునీటి సంఘాల ఎన్నికలపై మంత్రి సమీక్ష

పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయాన్ని 55 వేల 656.87 కోట్ల మేరకు 2019 ఫిబ్రవరిలో జలవనరులశాఖ సలహా కమిటీ ఆమోదించినట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి చెప్పారు. అయితే ప్రాజెక్టు ప్రయోజనాలను త్వరగా పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం 41.15 మీటర్ల నీటి నిల్వతో గత సంవత్సరం ఆగస్టులో సవరించిన అంచనాలను సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. అందులోనే ప్రాజెక్టు నిర్మాణం, స్పిల్‌వే, డ్యాం, జలాశయ పూర్తి మట్టం 45.72 మీటర్లు వరకు అవసరం అయిన నిర్మాణాలు, 41.15 మీటర్ల వరకు భూ సేకరణ, సహాయ, పునరావాస పనులను చేర్చినట్లు ఆయన చెప్పారు. దీని అనంతరం కేంద్రం పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు 30 వేల 436.95 కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోద ముద్ర వేసినట్లు ఆయన తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై స్పష్టత ఇచ్చిన పీపీఏ - రెండు దశల ప్రస్తావన లేదని వెల్లడి
2027లోపు పోలవరం పూర్తి - జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ పనులు: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.