Xiaomi 15 Series Launch: మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమీ తన 15 సిరిస్ మొబైల్స్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫ్లాగ్షిప్ సిరిస్‌లో స్టాండర్డ్ షావోమీ 15, 15 ప్రో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో లాంచ్ చేసిన ఈ మొబైల్స్ ప్రపంచవ్యాప్తంగా క్వాల్కామ్ లేటెస్ట్ చిప్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్స్. అయితే షావోమీ ఈ మొబైల్స్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు మీకోసం.
షావోమీ15 సిరీస్ కెమెరా:ఫొటోస్, వీడియోస్ కోసం షావోమీ రెండు స్మార్ట్ఫోన్లలో ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అందించేందుకు Leicaతో తన భాగస్వామ్యాన్ని కొనసాగించింది. షావోమీ 15, షావోమీ 15 ప్రో రెండూ 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉన్నాయి. దీని స్టాండర్డ్ మోడల్ 3.2x జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది. అయితే ప్రో మోడల్ 5x జూమ్‌తో 50MP సోనీ IMX858 పెరిస్కోపిక్ లెన్స్‌తో వస్తుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్వాల్కామ్ లేటెస్ట్ చిప్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్స్‌గా ఇవి నిలిచాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను కంపెనీ 16GB RAM, 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందించింది. అయినప్పటికీ షావోమీ 15 ప్రో.. స్టాండర్డ్ మోడల్లోని 5400mAh బ్యాటరీతో పోలిస్తే పెద్ద 6100mAh బ్యాటరీతో వస్తుంది.
షావోమీ15 స్పెసిఫికేషన్స్:
- డిస్‌ప్లే: 6.36-అంగుళాల మైక్రో-కర్వ్డ్ OLED (LTPO)
- రిజల్యూషన్: 1.5K
- రిఫ్రెష్ రేట్: 120Hz
- బ్రైట్‌నెస్: 3200 nits
- ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite
- RAM: 16GB వరకు (LPDDR5X)
- స్టోరేజీ: గరిష్టంగా 1TB (UFS 4.0)
- బ్యాక్ కెమెరా:50MP ప్రైమరీ (OIS) + 50MP అల్ట్రా-వైడ్ + 50MP టెలిఫోటో (3.2x జూమ్)
- ఫ్రంట్ కెమెరా: 32MP
- బ్యాటరీ: 5400mAh
- ఛార్జింగ్: 90W వైర్డ్, 50W వైర్‌లెస్
- OS: Android 15 బేస్డ్ HyperOS 2