X Audio Video Calling Feature :ఎక్స్ యూజర్లకు ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. సాధారణ వినియోగదారులకు క్రమంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని ఎక్స్ ఇంజినీర్ ఎన్రిక్ బర్రాగన్ తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు సైతం ఉచితంగా ఎక్స్ యాప్ నుంచి ఆడియో, వీడియో కాల్స్ చేసుకొవచ్చని వెల్లడించారు.
ఈ ఫీచర్‌ను గతేడాది యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఐఓఎస్) ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్లను ఈ ఫీచర్ వాడుకోవడానికి అనుమతిచ్చారు.
Elon Musk X New Calling Feature :2022లో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్, సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ట్విట్టర్‌కు 'ఎక్స్'గా నామకరణం చేశారు. ఎక్స్‌ను సమగ్ర అప్లికేషన్‌గా చేయాలన్న ఆలోచనతో సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆడియా, వీడియో కాల్స్‌ను సాధారణ యూజర్లు ఉపయోగించేలా మార్పులు చేశారు. ఇప్పుడు ఎక్స్ యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా, యాప్‌లోని ఏ యూజర్ నుంచి అయినా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చని బర్రాగన్ తెలిపారు.