Apple iPhone 16 Ban: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఇండోనేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఐఫోన్ల సేల్స్‌ను పూర్తిగా బ్యాన్ చేసింది. అందులో ముఖ్యంగా యాపిల్ ఇటీవల తీసుకొచ్చిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై నిషేధం విధించింది. విదేశాల నుంచి యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయకూడని వినియోగదారులను కూడా హెచ్చరించింది. అలా కాకుండా ఎవరైనా ఈ మోడల్ ఐఫోన్లను వినియోగిస్తే చట్టవిరుద్ధమని అని ఇండోనేషియా పరిశ్రమల మంత్రి అగస్ గుమివాంగ్ కర్తాసస్మిత ప్రకటించారు.
"ఇండోనేషియాలో ఎవరైనా iPhone 16ని తీసుకువస్తే అది చట్టవిరుద్ధం. విదేశాల నుంచి యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయకూడదు. ఇండోనేషియాలో ఐఫోన్ 16 సేల్స్ కోసం అంతర్జాతీయ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) సర్టిఫికేషన్ జారీ చేయలేదు."- అగస్ గుమివాంగ్ కర్తాసస్మిత, ఇండోనేషియా పరిశ్రమల మంత్రి
ఈ ఐఫోన్ల విక్రయాలపై ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) సర్టిఫికేట్ ఇవ్వలేదని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండోనేషియాలోని అనేక టాప్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇవి అందుబాటులో లేవు. అంతేకాక కంపెనీ ఇటీవల తీసుకొచ్చిన ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్, లేటెస్ట్ లైనప్‌లోని ఇతర మోడల్స్ యాపిల్ అధికారిక వెబ్సైట్లో కూడా ఆ దేశంలో విక్రయించడం లేదు.