Whatsapp Voice Message To Text :ప్రముఖమెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తమ యూజర్ల కోసం 'వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్' పేరిట ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. వాట్సప్ వాయిస్ మెసేజ్‌లను కొన్ని సందర్భాల్లో వినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాటప్పుడు వాయిస్ మెసేజ్‌లను, టెక్ట్స్ రూపంలోకి మార్చుకొని చదువుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
స్నేహితులు, కుటుంబ సభ్యులకు లెంగ్తీ మెసేజ్‌లు పంపాలనుకున్నప్పుడు వాట్సప్ వాయిస్ మెసేజ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే దీంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్ నోట్ అందినప్పటికీ, వివిధ కారణాల వల్ల దానిని ప్లే చేసి వినలేని పరిస్థితి ఏర్పడవచ్చు. దీనికి పరిష్కారంగానే వాయిస్ సందేశాన్ని టెక్ట్స్ రూపంలోకి మార్చుకొని చదివి, దానికి రిప్లై ఇచ్చేలా ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ సిద్ధం చేసింది.
వినకుండానే మెసేజ్‌కు రిప్లై
వాయిస్ నోట్ ట్రాన్‌స్క్రిప్షన్ ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు. కనుక వాయిస్ మెసేజ్‌ను ఓపెన్ చేసి వినాల్సిన అవసరం ఉండదు. కేవలం టెక్స్ట్ రూపంలోని మెసేజ్‌ను చదివి రిప్లై ఇవ్వవచ్చు. ఈ నయా ఫీచర్‌ను వాట్సప్ ఇప్పటికే కొంతమంది ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.