తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీరు మర్చిపోయినా వాట్సాప్​ మర్చిపోదుగా.. ఈ ఫీచర్​ ద్వారా మీకు గుర్తుచేస్తూనే ఉంటుంది! - WHATSAPP MESSAGE REMINDERS FEATURE

వాట్సాప్​లో 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్- ఇది ఎలా పనిచేస్తుందంటే..?

WhatsApp
WhatsApp (ANI)

By ETV Bharat Tech Team

Published : Dec 8, 2024, 6:29 PM IST

WhatsApp Message Reminders Feature:వాట్సాప్​లో మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేస్తోంది. ఇది మర్చిపోయిన మెసేజ్‌లను గుర్తుచేసేందుకు ఉపయోగపడనుంది. 'మెసెజ్ రిమైండర్స్' పేరుతో దీన్ని తీసుకురానున్నారు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి రానుంది? ఇది ఎలా పనిచేస్తుంది? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

ఈ ఫీచర్ ఉపయోగాలివే..!: ప్రస్తుతం వాట్సాప్​ లేని మొబైల్ లేదంటే అతిశయోక్తి కాదు. మెసెజ్, ఫొటోలు, వీడియోలు షేర్​ చేసేందుకు అంతా వాట్సాప్​నే వినియోగిస్తున్నారు. దీంతో వాట్సాప్​లో పెద్ద ఎత్తున మెసెజెస్ వచ్చి చేరుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు సమయంలేక కొన్ని మెజెస్​లను చదవకుండా అలానే వదిలేస్తుంటాం. కొన్ని మెసెజ్​లను మాత్రమే ఓపెన్ చేస్తాం. చదివే తీరిక లేక మరికొన్నింటిని తర్వాత చదువుదాంలే అనుకుని మర్చిపోతుంటాం. దీంతో కొన్ని చాట్స్​ మరుగున పడిపోతుంటాయి. అలా వదిలేసిన చాట్​లను రిమైండ్ చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్​ ఈ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించింది.

ఇది ఎలా పనిచేస్తుందంటే?:

సమాచారం ప్రకారం.. ఈ కొత్త వాట్సాప్​'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్​ కొన్ని స్పెసిఫిక్ కాంటాక్ట్స్​ నుంచి వచ్చిన అన్​రీడ్ మెసెజ్​లపై అలెర్ట్స్ పంపిస్తుంది. మనం తరచుగా ఎవరితో చాట్ చేస్తున్నామో ఆ కాంటాక్ట్స్​ లిస్ట్ ఆధారంగా ఇంటర్నల్ ఆల్గరిథమ్ మనకు ఈ నోటిఫికేషన్లను పంపిస్తుంది. అంటే మనం ఎక్కువగా చాట్ చేస్తున్న కాంటాక్ట్స్​ నుంచి వచ్చిన మెసెజ్​లను మధ్యలో కొన్ని చాట్స్ కారణంగా మర్చిపోతే ఈ ఫీచర్​ మనకు గుర్తుచేస్తుందన్నమాట.

WhatsApp Message Reminders Feature (Wabetainfo)

ఈ 'మెసెజ్ రిమైండర్స్' ఫీచర్​ను దాని ప్రీవియస్ అప్​డేట్​ నుంచి డెవలప్ చేశారు. గతంలో ఈ ఫీచర్ స్టేటస్ అప్‌డేట్స్ రిమైండింగ్‌ కోసం మాత్రమే నోటిఫికేషన్లను అందించేది. అయితే తాజాగా చాట్‌లలో చదవని మెసెజ్​లను ట్రాక్‌ చేయడంలో ఇది మీకు సాయం చేస్తుంది.

అందుబాటులోకి ఎప్పుడు?:ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ స్టేజ్​లో ఉంది. దీంతో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

యాక్టివేట్ చేసుకోవడం ఎలా?:ఫీచర్​ అందరికీ అందుబాటులోకి రాగానే Settings > Notifications > Reminders ఆప్షన్స్​ని సెలెక్ట్ చేసుకుని దీన్ని యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

స్టైలిష్ లుక్, అడ్వాన్స్​డ్ ఫీచర్స్.. బజాజ్ న్యూ చేతక్ ఈవీ వచ్చేస్తోందోచ్..!

న్యూ డిజైన్​తో రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్- బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

కంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్​లో వీటికి తిరుగేలేదు.. అమేజ్ vs డిజైర్.. ఈ రెండింటిలో బెస్ట్ ఇదే..!

ABOUT THE AUTHOR

...view details