తెలంగాణ

telangana

ETV Bharat / technology

165KM రేంజ్​తో 'విడా వీ2' ఎలక్ట్రిక్ స్కూటర్లు- కేవలం రూ.96వేలకే..! - VIDA V2 SERIES LAUNCHED

'విడా వీ2' సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంఛ్- ధర, ఫీచర్లు ఇవే..!

Vida V2 Series Electric Scooters
Vida V2 Series Electric Scooters (Vida India)

By ETV Bharat Tech Team

Published : Dec 5, 2024, 7:36 PM IST

Vida V2 Series Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ సబ్సిడరీ విడా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'Vida V2' సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్​లో 'V2 Lite', 'V2 Plus', 'V2 Pro' అనే మూడు వేరియంట్‌లు ఉన్నాయి.

'విడా వీ2' అనేది కంపెనీ 'విడా వీ1' శ్రేణికి కొత్త వెర్షన్. దీనితో హీరో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్​లోకి ప్రవేశించింది. ఇక కంపెనీ తీసుకొచ్చిన 'విడా వీ2' సిరీస్​లోని 'విడా వీ2 లైట్' అత్యంత సరసమైన, సరికొత్త వేరియంట్. ఈ బేస్ వేరియంట్ 2.2kWh చిన్న బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని IDC రేంజ్ 94 km అని కంపెనీ పేర్కొంది.

'వీ2 ప్లస్', 'వీ2 ప్రో' వేరియంట్‌లతో పోలిస్తే దీని టాప్​ స్పీడ్ చాలా తక్కువగా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 69 కిలోమీటర్లు. అదే సమయంలో 'వీ2 ప్లస్' టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఇక 'వీ2 ప్రో' టాప్​ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు.

అంతేకాక 'వీ2 లైట్​'లో 'Ride', 'Eco' అనే రెండు రైడింగ్ మోడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర ఫీచర్లు 'వీ2 ప్లస్', 'వీ2 ప్రో' వేరియంట్‌ల మాదిరిగానే 'వీ2 లైట్​'లో ఉన్నాయి.

కంపెనీ ఈ 'విడా వీ2' సిరీస్​లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లేను ఇచ్చింది. ఈ సిరీస్​లోని 'విడా వీ2 లైట్' అత్యంత సరసమైన ధరలో రూ. 96,000 (ఎక్స్-షోరూమ్, దిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ కెపాసిటీ పరంగా ఇది 'TVS iQube 2.2', 'Bajaj Chetak 2903' మోడళ్లతో సమానంగా ఉండటం విశేషం.

మరోవైపు విడా 'వీ2 ప్లస్', 'వీ2 ప్రో' లో మార్పులను గుర్తించడం కష్టం. ముఖ్యంగా ఈ వెర్షన్లు 'విడా వీ1' మోడల్​ను పోలి ఉంటాయి. అయితే పూర్తిగా 'వీ1' మాదిరిగా అయితే మాత్రం ఉండవు. 'వీ2 ప్లస్' రూ. 1.15 లక్షల ధరతో, 3.44kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 85kph వేగంతో, 143km IDC రేంజ్​తో వస్తుంది.

ఇక 'విడా వీ2' లైనప్‌లోని రేంజ్-టాపర్ 'వీ2 ప్రో' ధర రూ. 1.35 లక్షలు. ఇది 3.94kWh బ్యాటరీని కలిగి ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్కూటర్ 165కి.మీల IDC రేంజ్​ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇ-స్కూటర్ 5 సంవత్సరాలు/50,000 కిమీ వారంటీతో వస్తుంది. అయితే బ్యాటరీ ప్యాక్ 3 సంవత్సరాలు/30,000 కిమీ వారంటీతో వస్తుంది.

ధర:

'వీ2 లైట్' ఎలక్ట్రిక్ స్కూటర్​ ధర:రూ. 96,000 (ఎక్స్-షోరూమ్, దిల్లీ)

'వీ2 ప్లస్' ఎలక్ట్రిక్ స్కూటర్​ ధర: రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ)

'వీ2 ప్రో' ఎలక్ట్రిక్ స్కూటర్​ ధర:రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ)

2025 హోండా అమేజ్ ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి? ఇది డిజైర్ కంటే మెరుగ్గా ఉందా..?

ప్రోబా-3 మిషన్ సక్సెస్- నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ59

పోకో పవర్​ఫుల్ 5G ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. అది కూడా ప్రీమియం ఫీచర్లతో అత్యంత చౌకగా..!

ABOUT THE AUTHOR

...view details