తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఫోన్ యూజర్స్​ అందరికీ ఉపయోగపడే​ - ఈ టాప్ 8​ టిప్స్ & ట్రిక్స్ ఇవే! - Useful Phone Tricks - USEFUL PHONE TRICKS

Useful Phone Tips And Tricks : అప్పట్లో ఫోన్‌లు అంటే కేవలం కాల్ చేయడానికి, సమాచారం పంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ఫోన్​లో చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఫోన్‌లో గేమ్‌లు ఆడవచ్చు, వీడియోలు చూడవచ్చు, మీకు కావాల్సిన అన్ని రకాల పనులను చేయవచ్చు. అందుకే మీ లైఫ్​ను మరింత ఈజీ చేసే టాప్​-8 ఫోన్ హ్యాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

SECRET PHONE FEATURES YOU MUST KNOW
Hidden Smartphone Tricks (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 12:32 PM IST

Useful Phone Tips And Tricks :మనం ఫోన్కొన్నపుడు అందులో కొన్ని యాప్స్ ప్రీలోడెడ్​గా వస్తాయి. నిజానికి వీటిలో చాలా యాప్స్ మనకు అస్సలు ఉపయోగం లేనివి, వాడనివే ఉంటాయి. కాబట్టి ముందు అలాంటి యాప్స్​ను గుర్తించి, వాటిని డిలీట్ చేయడం మంచిది. ఇది ఫోన్ ఫాస్ట్ కావడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది ఏరోప్లేన్ మోడ్, డార్క్ మోడ్ లాంటి ఆప్షన్స్ కోసం సెట్టింగ్స్​లోకి వెళ్లి, వాటి కోసం వెతికి సెట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల టైం ఎక్కువ తీసుకుంటుంది. దీన్ని నివారించేందుకు ఉపయోగపడేదే క్విక్ సెట్టింగ్ మెను.

రొటేషన్ ఆప్షన్
చాలా మంది తమ ఫోన్​లను సైడ్​కి తిప్పినపుడు ఆటోమెటిక్​గా ఫోన్ స్క్రీన్ టర్న్ అవుతుంది. దానికి కారణం ఆటో రొటేషన్ అనే ఆప్షన్​ను ఆన్ చేసి ఉంచడమే. కానీ దేని వల్ల మనం ఫోన్​ను సైడ్​కి టర్న్ చేసిన ప్రతిసారి స్క్రీన్ మొత్తం రొటేట్ అవుతుంది. ఇది కొన్ని సార్లు చికాకు తెప్పించవచ్చు. ఇలా కాకుండా ఉండాలంటే ఆటో రొటేషన్ ఆప్షన్​ను ఆఫ్ చేసుకోవాలి. మనకు కావాలి అనుకున్నపుడు మాత్రమే టర్న్ చేసుకుంటే ఎలాంటి గొడవా ఉండదు.

ఫొటోలకు క్యాప్షన్
ఒక్క ఫొటో కొన్ని వేల పదాలకు సమానం. ప్రతి ఫొటో వెనకాల ఒక మంచి లేదా చెడు జ్ఞాపకం ఉంటుంది. దాని విలువ అప్పుడు తెలియక పోయినా, తర్వాత ఆ ఫొటో చూసినపుడు ఆ సంఘటనకు సంబంధించిన విషయాలు, జ్ఞాపకాలు గుర్తుకుతెస్తాయి. అలాంటి ఫొటోలకు క్యాప్షన్ లేదా డిస్క్రిప్షన్​ను యాడ్ చేస్తే ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

పీసీ నుంచే యాప్స్ డౌన్లోడ్
ఇది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే. మీ ఫోన్​లో వాడే మెయిల్, పీసీలో వాడే మెయిల్ ఒకటే అయితే, మీ పీసీ నుంచే యాప్స్​ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యాప్​లో ఫాస్ట్​గా లాగిన్ కావడానికి ఉపయోగపడుతుంది.

వాల్యూమ్ బటన్‌ను క్లిక్ చేసినా!
నేచురల్ మెథడ్‌లో మీరు సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఐతే ఈ ఆప్షన్ మీ కోసమే. సాధారణంగా సెల్ఫీ తీసుకునేటప్పుడు మెయిన్ బటన్ యూజ్ చేస్తాం. కానీ చాలా మందికి తెలియని ఆప్షన్ ఏంటంటే, వాల్యూమ్ బటన్‌ను క్లిక్ చేసినా సెల్ఫీ ఫొటో క్లిక్ అవుతుంది. నమ్మకపోతే ఓ సారి మీరూ ట్రై చేయండి.

నోటిఫికేషన్ల కస్టమైజేషన్
మొబైల్ఫోన్లలో నోటిఫికేషన్లను కస్టమైజ్ చేయవచ్చు. కొన్ని సార్లు మనం వాడని యాప్స్ నుంచి కూడా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. అందుకే మనం వాడని యాప్స్​కు సంబంధించిన నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం మంచిది. ఇది మన ఫోన్ బ్యాటరీ లైఫ్​ను సైతం మెరుగుపరుస్తుంది.

పదాలు పలుకుతాయి
చాలా ఫోన్లలో పదాలను పలికించే ప్రనౌన్సియేషన్ ఫీచర్ కూడా ఉంటుంది. మనం ఏదైనా అక్షరాన్ని కానీ, పదాన్ని కానీ సెలెక్ట్ చేస్తే, ప్రనౌన్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ పదాన్ని పలుకుతూ ఆడియో వినిపిస్తుంది. ఇది మనం నలుగురిలో స్పష్టమైన ఉచ్ఛారణతో ఆంగ్ల పదాలకు పలికేందుకు తోడ్పడుతుంది.

స్మార్ట్ హోం కంట్రోల్
చాలా మంది ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఏసీలు ఉంటాయి. వాటన్నింటిని మనం స్మార్ట్ ఫోన్‌ నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఫోన్‌లోని పవర్ బటన్‌ను లాంగ్ క్లిక్ చేస్తే, మనం స్మార్ట్ టీవీకి కనెక్ట్ కావచ్చు. ఫోన్ నుంచే మన ఇంట్లోని స్మార్ట్ లైట్ల వెలుగులో హెచ్చుతగ్గులు చేయొచ్చు. స్మార్ట్ మ్యూజిక్‌ సిస్టమ్‌లో మ్యూజిక్ ట్రాక్‌లను మార్చొచ్చు. ఫోన్‌ నుంచి స్మార్ట్ ఏసీ ఎన్ని పాయింట్లు ఉండాలనేది అడ్జస్ట్ చేయొచ్చు.

స్పేస్ బటన్‌లో ఆ ఆప్షన్
మనం ఫోనులో ఏదైనా మెసేజ్‌ను టైప్ చేస్తున్నప్పుడు తప్పులు దొర్లితే గాబరా పడిపోతాం. అప్పటి వరకు మనం రాసిన చాలా పదాల మధ్యనున్న ఒక పదంలో ఉన్న తప్పును ఎలా తొలగించాలో తెలియక, మొత్తం టెక్ట్స్‌ను డిలీట్ చేస్తుంటాం. అలా చేయకుండా ఫోనులోని కీ బోర్డులో ఉన్న స్పేస్ బటన్‌ను గట్టిగా నొక్కి పడితే చిన్నపాటి కర్సర్ ఆప్షన్ ప్రత్యక్షం అవుతుంది. దాన్ని అటూఇటూ కదిలిస్తూ, మనం ఏ పదంలోనైతే కరెక్షన్ చేయాలో అక్కడికి ఈజీగా చేరుకోవచ్చు. ఆ పదంలో కరెక్షన్ చేసి వచ్చి, మెసేజ్ రాయడాన్ని కంటిన్యూ చేయొచ్చు.

గూగుల్ క్రోమ్ నయా ఫీచర్​ - ఇకపై వెబ్​ పేజ్​లు చదవాల్సిన పనిలేదు - నేరుగా వినేయడమే! - Google Chrome Features

వాట్సాప్​ నయా వీడియో కాల్​ ఫీచర్స్​​ - స్క్రీన్​​ షేరింగ్, స్పీకర్ స్పాట్​లైట్​ - గూగుల్​ మీట్​, జూమ్​లకు పోటీగా! - WhatsApp Video Call Features

ABOUT THE AUTHOR

...view details