Volkswagen Tayron Unveiled: వాహన ప్రియులకు గుడ్‌న్యూస్. మార్కెట్లోకి త్వరలో కొత్త కారు ఎంట్రీ ఇవ్వనుంది. జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన కొత్త టైరాన్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇందులో ప్రాక్టికాలిటీ, ఆన్‌బోర్డ్ టెక్నాలజీతో నాలుగు ఇంజిన్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ స్థానాన్ని ఇది రీప్లేస్ చేయనుంది. టిగువాన్ వెర్షన్‌కు చెందిన ఈ త్రీ- రో వెర్షన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో బీజింగ్ మోటార్ షోలో ప్రదర్శించారు. దీనికి 'టిగువాన్ ఎల్ ప్రో' అనే కోడ్ నేమ్ ఇచ్చారు. ప్రస్తుతం దీని ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ కారు 198 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తోంది. దీని బూట్ ఫ్లోర్ కింద 19.7kWh బ్యాటరీ ఉంది. ఈ సందర్భంగా ఈ కారుపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
ఫీచర్లు:
- 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- 12.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్
- 15-అంగుళాల హెడ్-అప్ డిస్‌ప్లే ఆప్షనల్ ఫీచర్
- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
- లేన్ కీప్ అసిస్ట్
- అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
- వీటితో పాటు ఇందులో ఇతర ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్స్: వోక్స్‌వ్యాగన్ టెరాన్ నాలుగు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తోంది. ఇందులో పెట్రోల్, ప్యూర్ పెట్రోల్, పెట్రోల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్‌తో స్టార్ట్ అవుతుంది. ఇది ముందు చక్రాలకు 148 bhp పవర్‌ను అందిస్తుంది. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 201 bhp లేదా 261 bhp పవర్‌ని జనరేట్ చేస్తుంది.
టర్బో డీజిల్ ఇంజిన్: పైన పేర్కొన్న వాటితో పాటు 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. ఇది 148 bhp లేదా 190 bhp పవర్‌తో వస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో ఫ్రంట్-వీల్ డ్రైవ్, రెండోది VW.. 4Motion 4WDతో వస్తుంది. ఈ వేరియంట్స్‌లో ప్రతిదీ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది.