తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఆఫీస్ ఫోన్​/ కంప్యూటర్స్ వాడుతున్నారా? ఈ 15 పనులు అస్సలు చేయకండి! - Dos and Donts on Office Laptop - DOS AND DONTS ON OFFICE LAPTOP

15 Things You Should Never Do On A Work Computer : మీ వద్ద కంపెనీ వాళ్లు ఇచ్చిన ల్యాప్​టాప్​ లేదా డెస్క్​టాప్ ఉందా? అయితే దానిలో 15 పనులు ఎప్పుడూ చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

DOS AND DONTS ON OFFICE COMPUTER
Things You Should Never Do on A Work Computer

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 1:26 PM IST

Updated : Apr 6, 2024, 2:14 PM IST

15 Things You Should Never Do On A Work Computer : కరోనా సంక్షోభం తరువాత 'వర్క్​ ఫ్రమ్ హోమ్' చేయడం అనేది చాలా సాధారణంగా మారింది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్​కు వచ్చి, పనిచేయాలని బలవంతపెడుతున్నాయి. అయితే మీరు ఇంట్లో ఉండి పనిచేస్తున్నా, లేదా ఆఫీస్​కు వచ్చి పని చేస్తున్నా, కంపెనీ ఇచ్చిన కంప్యూటర్​లో కొన్ని పనులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  1. కంపెనీలు తమ ఉద్యోగులకు కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లు ఇస్తూ ఉంటాయి. వాటిల్లో కేవలం కంపెనీ పనులు మాత్రమే చేయాలి. అలాకాకుండా ఫేస్​బుక్​ లాంటి సోషల్ మీడియా అకౌంట్లు చూడడం; నెట్​ఫ్లిక్స్, అమెజాన్​ లాంటి ఓటీటీలను చూడడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే, కంపెనీలు మిమ్మల్ని ట్రాక్ చేసేందుకు మానిటరింగ్ సాఫ్ట్​వేర్స్ లేదా ప్రొడక్టివిటీ సాఫ్ట్​వేర్స్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇవి మీరు చేసే పనులను ఇట్టే పసిగట్టేస్తాయి.
  2. మీరు కంపెనీకి సంబంధించిన సున్నితమైన (సెన్సిటివ్​) సమాచారాన్ని నిర్వహిస్తూ ఉంటే, దానిని చాలా భద్రంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, కంపెనీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మీపై కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
  3. ఒక వేళ ఆఫీస్​ ల్యాప్​టాప్ లేదా కంప్యూటర్​లో మానిటరింగ్ సాఫ్ట్​వేర్స్ లేకపోయినా, మీరు హద్దులు మీరకూడదు. ఎందుకంటే మీ ఉన్నతాధికారులకు, ఐటీ నిపుణులకు మీ డివైజ్​ను చెక్​ చేసే అధికారం కంపెనీ ఇస్తుంది.
  4. కంపెనీ ఇచ్చిన ల్యాప్​టాప్​, డెస్క్​టాప్​, స్మార్ట్​ఫోన్స్​, ట్యాబ్స్​లో మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఫైల్స్​ను ఎప్పుడూ సేవ్ చేసి ఉంచకూడదు. ఎందుకంటే, ఒక వేళ మిమ్మల్ని సదరు కంపెనీ నుంచి తొలగిస్తే, మీ డేటా మొత్తం వాళ్లదగ్గరే ఉండిపోతుంది. పైగా దీని వల్ల న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
  5. కంపెనీ ఇచ్చిన డివైజ్​ల్లో ఏవి పడితే అవి సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే, మీ నావిగేషన్ హిస్టరీతోపాటు, మీరు ఇంటర్నెట్​లో ఏమేమి చెక్ చేశారో చాలా ఈజీగా కంపెనీ గుర్తించగలదు.
  6. స్లాక్ (Slack) లాంటి సాఫ్ట్​వేర్స్​లో వ్యక్తిగత చాటింగ్​లు చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి యాప్స్​లో మీరు చేసే ప్రతి పనీ కంపెనీ యాజమాన్యానికి తెలిపిపోతుంది. స్లాక్​ మాత్రమే కాదు, కంపెనీ డివైజ్​ల్లో ఇతర చాటింగ్ యాప్స్ కూడా వాడకూడదు.
  7. కంపెనీలు ఇచ్చే ల్యాప్​టాప్​ల్లో, డెస్క్​టాప్​ల్లో మీ వ్యక్తిగత ఈ-మెయిల్​తో లాగిన్ కాకూడదు. ఎందుకంటే, సీనియర్ ఆఫీసర్లు మీ మెయిల్స్​ అన్నింటినీ చూసే అవకాశం ఉంటుంది. ఇది మీ ప్రైవసీకి తీవ్రమైన భంగం కలిగిస్తుంది.
  8. మీ దగ్గర ఉన్న వర్క్ ల్యాప్​టాప్​ ఆఫ్​లో ఉన్నప్పటికీ (జీ-షూట్​) గూగుల్ డ్రైవ్​, డాక్స్​, షీట్స్ లాంటి వాటిలో మీ పర్సనల్ ఫైల్స్​ను ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీ మెయిల్ అకౌంట్​తో లింకై ఉంటాయని కాబట్టి, కంపెనీ వాళ్లు వాటిని చూసే ప్రమాదం ఉంటుంది.
  9. మీరు ఎక్కడైనా వెళ్లినప్పుడు, వర్కింగ్ కంప్యూటర్​ను లాక్ చేసుకోవాలి. లేకపోతే ఇతరులు ఎవరైనా మీ డివైజ్​ను యాక్సెస్​ చేసి, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఏర్పడవచ్చు.
  10. పబ్లిక్ ప్రదేశాల్లో ల్యాప్​టాప్స్, సెల్​ఫోన్స్​ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ సమాచారాన్ని ఇతరులు దొంగతనంగా చూసే అవకాశం ఉంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై వాడకూడదు. అత్యవసరమైతే వీపీఎన్​ ఉపయోగించాలి.
  11. మీ కంపెనీ ఇచ్చిన కంప్యూటర్​లో, ఇతర కంపెనీల, క్లయింట్​ల వర్క్ చేయకూడదు.
  12. ఎవరూ చూడడం లేదు కదా అని, కంపెనీ ఇచ్చిన డివైజ్​లో అభ్యంతరకరమైన, అనుచితమైన కంటెంట్ (పోర్న్​ కంటెంట్​) చూడకూడదు. ఇలా చేస్తే మీపై చాలా బ్యాడ్​ ఇంప్రెషన్ ఏర్పడుతుంది.
  13. కంపెనీ వాళ్లు తమ భద్రత కోసం చాలా సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు.
  14. కంపెనీ అనుమతించని సాఫ్ట్​వేర్లు, అప్లికేషన్లు ఇన్​స్టాల్ చేయకూడదు.
  15. 'ఇవన్నీ చూసి మీరు భయపడాల్సిన పనిలేదు! మీ బ్యాంకు ఖాతాలు చూడవచ్చు. అవసరమైతే పేమెంట్స్ కూడా చేయవచ్చు' అని నిపుణులు చెబుతున్నారు.
Last Updated : Apr 6, 2024, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details