Tata Punch Camo Edition Launch: దసరా శరన్నవరాత్రుల వేళ మార్కెట్లో మరో సరికొత్త కారు లాంచ్ అయింది. ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రసిద్ధ మినీ SUV టాటా పంచ్ లైనప్‌లో కామో ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకమైన కామో థీమ్‌తో తీసుకొచ్చిన ఈ కారులో పలు ప్రీమియం ఫీచర్స్‌ను పొందుపరిచినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈసారి కారును పరిమిత యూనిట్లలో మాత్రమే విక్రయించనున్నారు.
2021లో టాటా పంచ్ విడుదల చేసిన నాటి నుంచి కస్టమర్ల నుంచి దీనికి అద్భుతమైన స్పందన లభిస్తోందని, తాజాగా ఈ కామో ఎడిషన్ పంచ్ కూడా వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందని భావిస్తున్నట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సీసీఓ వివేక్ శ్రీవాత్సవ అన్నారు.
టాటా పంచ్ కామో ఎడిషన్ ప్రత్యేక ఫీచర్స్:
- 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
- సరికొత్త సీవీడ్ గ్రీన్ కలర్
- ఆటో AC
- వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
- వైట్ రూఫ్
- ఆర్16 చార్‌కోల్ గ్రే అల్లాయ్ వీల్స్
- యాపిల్ కార్ ప్లే
భద్రతా ఫీచర్లు:
- డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
- EBDతో కూడిన ABS
- రియర్ పార్కింగ్ కెమెరా
- రియర్ పార్కింగ్ సెన్సార్స్
ఎక్స్‌టీరియర్: 2024 టాటా పంచ్ కామో ఎడిషన్ సీవీడ్ గ్రీన్ ఎక్స్‌టీరియర్ షేడ్‌లో వైట్ రూఫ్‌తో వస్తోంది. దీంతోపాటు ఇందులో 16-అంగుళాల డార్క్ గ్రే అల్లాయ్ వీల్స్, సైడ్ ఫెండర్‌లపై 'కామో' బ్యాడ్జ్ ఉంటుంది.