తెలంగాణ

telangana

ETV Bharat / technology

టాటా మోటార్స్ మరో ఘనత- క్రాష్​ టెస్ట్​లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్

భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా కార్లకు ఫైవ్ స్టార్స్- ప్రయాణికుల సేఫ్టీలో బెస్ట్!!!

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Tata Curvv Bharat NCAP Crash Test
Tata Curvv Bharat NCAP Crash Test (Bharat NCAP)

Tata Curvv Bharat NCAP Crash Test: టాటా మోటార్స్ మరో ఘనత సాధించింది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా సంస్థ ఇటీవల లాంచ్ చేసిన రెండు మోడల్స్ కార్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ సాధించాయి. టాటా మోటార్స్ ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ చేసిన టాటా కర్వ్, కర్వ్ ఈవీ మోడల్స్ అడల్ట్‌ ప్రొటెక్షన్‌, చైల్డ్‌ సేఫ్టీ విషయంలో ఫైవ్​ స్టార్ రేటింగ్స్​ను పొందాయి. భారత్‌ న్యూకార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద ఈ రెండు కార్లూ అత్యధిక రేటింగ్‌ పాయింట్లు అందుకున్నాయి. దీంతో ప్రయాణికుల సేఫ్టీ విషయంలో టాటా మోటార్స్ కార్లు బెస్ట్​ అని మరోసారి నిరూపించుకుంది.

Tata Curvv Bharat NCAP Crash Test (Bharat NCAP)

టాటా కర్వ్ పాయింట్స్ ఇలా:

  • టాటా కర్వ్ పెద్దవారి సేఫ్టీ విషయంలో 32 పాయింట్లకు గానూ 29.5 సాధించింది.
  • చైల్డ్‌ ప్రొటెక్షన్‌ విషయంలో 49కి 43.66 పాయింట్లను కర్వ్ పొందింది.

టాటా కర్వ్ ఈవీ పాయింట్స్ ఇలా:

  • కర్వ్‌ ఈవీ అడల్ట్‌ ప్రొటెక్షన్‌లో 32కి గాను 30.81 పాయింట్స్ సాధించింది.
  • ఐల్డ్‌ ప్రొటెక్షన్‌లో 49కి 44.83 పాయింట్లు ఈవీ పొందింది.

గతంలో టాటా మోటార్స్‌కే చెందిన నెక్సాన్‌ కూడా భారత్ NCAPలో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. అడల్ట్‌ ప్రొటెక్షన్‌ విషయంలో 32కి 29.41 పాయింట్లు, చైల్డ్‌ సేఫ్టీ విషయంలో 49కి 43.83 పాయింట్స్ సాధించింది. టాటా నెక్సాన్​ను గతేడాది సెప్టెంబర్​లో లాంచ్ చేయగా ఈ ఏడాది ఆగస్టులో పరీక్షించారు. ఈ క్రమంలో టాటా కర్వ్ మోడల్స్ ఆగస్టులో రిలీజ్ చేయగా సెప్టెంబర్​లో వీటిని టెస్ట్ చేశారు.

టాటా కర్వ్ ఫీచర్స్:

  • ఆరు ఎయిర్‌ బ్యాగ్స్
  • 360 డిగ్రీల కెమెరా
  • లెవల్‌ 2 అడాస్‌
  • ఆల్‌ డిస్క్ బ్రేక్స్‌
  • ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేకింగ్‌ విత్‌ ఆటో హోల్డ్‌

టాటా కర్వ్‌ ఈవీ ఫీచర్స్:

  • ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ ఆటోహోల్డ్‌ ఫంక్షన్‌తో ఆరు ఎయిర్‌బ్యాగ్స్
  • డ్రైవర్‌ డ్రౌజీనెస్‌ అలర్ట్
  • బ్లైండ్‌స్పాట్‌ మానిటర్‌
  • లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లు
Tata Curvv Bharat NCAP Crash Test (Bharat NCAP)

టాటా కర్వ్‌ ధర:

  • పెట్రోల్‌ వేరియంట్ ధర:రూ.9.99 లక్షలు
  • డీజిల్‌ వేరియంట్ ధర: రూ.11.49 లక్షల నుంచి ప్రారంభం

టాటా కర్వ్‌ ఈవీ ధర: రూ.17.50 లక్షల నుంచి ప్రారంభం

సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు ఫుల్​ గిరాకీ- ఈ స్కిల్స్​ నేర్చుకుంటే జాబ్ పక్కా..!

చిమ్మ చీకట్లో కూడా వీడియో కాల్స్- వాట్సాప్​ కొత్త ఫీచర్​ను యాక్టివేట్ చేసుకోండిలా..!

ABOUT THE AUTHOR

...view details