Skoda Kylaq All Variants Price List:స్కోడా ఆటో ఇండియా తన అతి చిన్న కంపాక్ట్ SUV 'స్కోడా కైలాక్' అన్ని వేరియంట్‌ల ధరలను రివీల్ చేసింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి స్కోడా కారు. కంపెనీ ఈ కారుతో సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ఈ కారును కొత్త మోడ్రన్ సాలిడ్ డిజైన్‌తో ఇటీవలే నవంబర్ నెలలో లాంఛ్ చేసింది. మార్కెట్లో దీని బుకింగ్స్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే దీని డెలివరీలు వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా వేరియంట్ల వైజ్‌గా దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ట్రిమ్ ఆప్షన్స్:స్కోడా కైలాక్ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది.
- క్లాసిక్ (Classic)
- సిగ్నేచర్ (Signature)
- సిగ్నేచర్+ (Signature+)
- ప్రెస్టీజ్ (Prestige)
Complete Price List of Skoda Kylaq:
Skoda Kylaq Trim | Petrol MT | Petrol AT |
Classic | Rs 7.89 lakh | - |
Signature | Rs 9.59 lakh | Rs 10.59 lakh |
Signature+ | Rs 11.40 lakh | Rs 12.40 lakh |
Prestige | Rs 13.35 lakh | Rs 14.40 lakh |
*All prices ex-showroom |
కలర్ ఆప్షన్స్: ఈ కారు మార్కెట్లో ఏడు రంగులలో అందుబాటులో ఉంది.
- టోర్నాడో రెడ్ (Tornado Red)
- బ్రిలియంట్ సిల్వర్ (Brilliant Silver)
- క్యాండీ వైట్ (Candy White)
- కార్బన్ స్టీల్ (Carbon Steel)
- లావా బ్లూ (Lava Blue)
- డీప్ బ్లాక్ (Deep Black)
- ఆలివ్ గోల్డ్ (Olive Gold)
వీటితోపాటు కంపెనీ ఈ కారుకు 3 సంవత్సరాలు/లక్ష కిలోమీటర్ల వారంటీని కూడా ఆఫర్ చేస్తోంది. అంతేకాక స్టాండర్డ్ వారంటీని కూడా అందిస్తోంది.
ఫీచర్లు: స్కోడా కైలాక్ లైనప్ ప్రారంభ ధర రూ.7.89 లక్షలు. ఇది ఎంట్రీ లెవల్ క్లాసిక్ ట్రిమ్. ఈ ట్రిమ్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల వింగ్ మిర్రర్లతో పాటు ఇందులో అన్నీ LED లైట్లే ఉన్నాయి. అయితే ఈ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.