తెలంగాణ

telangana

ETV Bharat / technology

శాంసంగ్ గెలాక్సీ S25 క్రేజ్ చూశారా?- ఏకంగా 4.30 లక్షల ప్రీ-బుకింగ్స్​తో రికార్డ్! - SAMSUNG GALAXY S25 SERIES SALE

భారత మార్కెట్​లో శాంసంగ్ హవా- భారీ డిమాండ్​తో దూసుకుపోతున్న గెలాక్సీ S25 సిరీస్!

Samsung Galaxy S25 Series
Samsung Galaxy S25 Series (Photo Credit- Samsung)

By ETV Bharat Tech Team

Published : Feb 9, 2025, 8:06 PM IST

Samsung Galaxy Series S25 Sale:శాంసంగ్ ఇటీవల లాంఛ్ చేసిన తన 'గెలాక్సీ S25' సిరీస్ భారత్​లో​ భారీ క్రేజ్​తో దూసుకుపోతోంది. కంపెనీ జనవరి 22న కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో 'గెలాక్సీ అన్​ప్యాక్డ్ 2025' ఈవెంట్​లో ఈ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ సిరీస్​ను ప్రారంభించింది. ఈ సిరీస్​లో 'శాంసంగ్ గెలాక్సీ S25', 'గెలాక్సీ S25 ప్లస్', 'గెలాక్సీ S25 అల్ట్రా' అనే మూడు మోడల్స్​ను తీసుకొచ్చింది. అదే జోరులో శాంసంగ్ జనవరి 23 నుంచే అదిరే బెనిఫిట్స్, ఆఫర్లతో మార్కెట్​లో వీటి ప్రీ-బుకింగ్స్​ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఇవి ఏకంగా 4.30 లక్షల ప్రీ-ఆర్డర్‌లను అందుకుని రికార్డ్ సృష్టించాయి.

ప్రీ-బుకింగ్‌లో శాంసంగ్ రికార్డ్:మేడ్​ ఇన్ ఇండియా​ 'గెలాక్సీ S25' సిరీస్​ స్మార్ట్​ఫోన్లు 4లక్షల 30వేల ప్రీ-ఆర్డర్​లను సొంతం చేసుకున్నట్లు కంపెనీ గత శుక్రవారం వెల్లడించింది. ఇది గతేడాది ప్రారంభించిన 'శాంసంగ్ గెలాక్సీ S24' సిరీస్ ప్రీ-బుకింగ్ కంటే ఇది 20% ఎక్కువ. కాగా శాంసంగ్ తన నోయిడా ఫ్యాక్టరీలో భారత మార్కెట్​ కోసం గెలాక్సీ S25 సిరీస్‌ను తయారు చేస్తోంది.

ఇదిలా ఉండగా ప్రీ-బుకింగ్​లో సృష్టించిన రికార్డ్​పై శాంసంగ్ ఇండియా MX డివిజన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా 'గెలాక్సీ S25 అల్ట్రా', 'గెలాక్సీ S25+', 'గెలాక్సీ S25' స్మార్ట్​ఫోన్​లుశాంసంగ్ అద్భుతమైన AI ఎక్స్​పీరియన్స్​తో కొత్త స్టాండర్డ్​ను సెట్ చేశాయని అన్నారు.

దీంతోపాటు గెలాక్సీ AI వినియోగంలో ముందంజలో ఉన్న యంగ్ టెక్ ప్రియులలో 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్‌కు అత్యధిక డిమాండ్‌ ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు. గూగుల్​కు చెందిన Gemini Live భారతదేశంలోని 'గెలాక్సీ S25' కస్టమర్‌లకు మొదటి నుంచీ హిందీలో కూడా అందుబాటులో ఉంటుందని, ఇది శాంసంగ్​కి భారతదేశం ఎంత ముఖ్యమైనదో చూపిస్తుందని అన్నారు.

భారతదేశంలో శాంసంగ్ ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 7, 2025 నుంచి ప్రారంభమైంది. అమెజాన్, శాంసంగ్ వెబ్‌సైట్‌తో సహా వివిధ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కంపెనీ వీటిని విక్రయానికి అందుబాటులో ఉంచింది. రాజు పుల్లాన్ మాట్లాడుతూ "ఈ సంవత్సరం మేము మా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను దేశవ్యాప్తంగా 17,000 అవుట్‌లెట్‌లలో విక్రయించేందుకు నిర్ణయించాము. తద్వారా మేము చిన్న నగరాల్లో కూడా వీటి డిమాండ్‌పై దృష్టి సారించగలము" అని పేర్కొన్నారు.

సునీతా రాకపై సర్వత్రా ఉత్కంఠ- షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి!- ఎలాగంటే?

వన్​ప్లస్​ నుంచి అదిరే ఫోన్లు వచ్చేస్తున్నాయ్- ఈ ఏడాది సందడి చేయనున్న మోడల్స్ ఇవే!

ఏంటి మామా ఇది నిజమేనా.. 10 నిమిషాల్లోనే కార్ల డెలివరీనా?- జెప్టో క్రేజీ వీడియో చూశారా?

ABOUT THE AUTHOR

...view details