Samsung Galaxy S24 FE Launched: పండగల వేళ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ మంచి జోరు మీద ఉంది. ఇటీవలే బిగ్ బ్యాటరీతో m15 5g ప్రైమ్ ఎడిషన్‌ను రిలీజ్ చేసిన శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన ఎస్24 ఫోన్‌ను పోలిన డిజైన్‌తో దీన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఏటా తీసుకొచ్చే S సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్.. కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తుంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా S24 FEను శాంసంగ్ కంపెనీ ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేషన్, నోట్ అసిస్టెంట్, ఇంటర్‌ప్రిటేర్ మోడ్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు ఐపీ 68 రేటింగ్ కలిగిన ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. నేటి నుంచి వీటి ప్రీ ఆర్డర్లు ప్రారంభమవ్వగా.. అక్టోబర్ 3 నుంచి ఇండియాలో సేల్స్ ప్రారంభం కానున్నాయి. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ ఫీచర్లు:
- ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ ఆండ్రాయిడ్ 14తో కూడిన వన్‌యూఐ 6.1తో పనిచేస్తుంది.
- డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X
- రిఫ్రెష్ రేటు: 120Hz
- ప్రాసెసర్: 4నానో మీటర్ డెకా కోర్ కలిగిన ఎగ్జినోస్ 2400ఈ
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ కెమెరా:
- మెయిన్ కెమెరా: ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 ఎంపీ
- టెలిఫొటో లెన్స్: 8 ఎంపీ
- అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా: 12 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 10 ఎంపీ
- బ్యాటరీ:4,700 ఎంఏహెచ్
- 25W ఫాస్ట్ ఛార్జింగ్