తెలంగాణ

telangana

ETV Bharat / technology

పండగ వేళ మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Samsung Galaxy M55s 5G Launched - SAMSUNG GALAXY M55S 5G LAUNCHED

Samsung Galaxy M55s 5G Launched: పండగ వేళ మార్కెట్లో మరో స్మార్ట్​ఫోన్ లాంచ్ అయింది. ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్ తన అప్డేటెడ్ ఎం55 ఎస్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఫోన్​తో ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో ఒకేసారి వీడియో తీయొచ్చు. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

Samsung Galaxy M55s 5G Launched
Samsung Galaxy M55s 5G Launched (Samsung)

By ETV Bharat Tech Team

Published : Sep 24, 2024, 12:53 PM IST

Samsung Galaxy M55s 5G Launched: పండగ వేళ మార్కెట్లో మరో స్మార్ట్​ఫోన్ లాంచ్ అయింది. ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్ తన అప్డేటెడ్ ఎం55 ఎస్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఫోన్​తో ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో ఒకేసారి వీడియో తీయొచ్చు. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

Samsung Galaxy M55s 5G Launched: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ మరో సరికొత్త మొబైల్​ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. గతంతో ఎం55, ఎఫ్‌55 ఫోన్లనుతీసుకొచ్చిన శాంసంగ్.. చిన్న చిన్న మార్పులతో తాజాగా ఎం55 ఎస్‌ను ఆవిష్కరించింది. దిమ్మతిరిగే ఫీచర్లతో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం55s 5G మొబైల్​ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దీని ధర, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.

శాంసంగ్ గెలాక్సీ M55s 5G స్పెసిఫికేషన్స్:

  • డిస్‌ప్లే: 6.7-అంగుళాల ఫుస్ HD+ సూపర్ AMOLED
  • బ్యాటరీ:5000 ఎంఏహెచ్‌
  • ప్రాసెసర్: స్నాప్​డ్రాగన్ 7 జనరేషన్ 1
  • రిఫ్రెష్ రేట్‌: 120Hz
  • బ్రైట్​నెస్​: 1,000 నిట్స్
  • మందం: 7.8mm
  • విజన్ బూస్టర్ టెక్నాలజీ
  • నైటోగ్రఫీ ఫీచర్
  • OISతో కూడిన 50MP కెమెరా
  • అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్: 8MP
  • మ్యాక్రో సెన్సర్: 2MP
  • 45w ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ
  • ఇన్​డిస్​ప్లే ఫింగర్​ ప్రింట్ సెన్సర్

కలర్ ఆప్షన్స్:

Samsung Galaxy M55s 5G Launched (Samsung)
  • కోరల్ గ్రీన్
  • థండర్ బ్లాక్‌

కెమెరా:

Samsung Galaxy M55s 5G Launched (Samsung)
  • కెమెరా ఫీచర్ల విషయానికొస్తే Galaxy M55s 5G మొబైల్​తోస్పష్టమైన ఫొటోస్ అండ్ వీడియోస్ తీయొచ్చు.
  • ఇందుకోసం దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP కెమెరా ఉంది.
  • దీంతోపాటు అద్భుతమైన సెల్ఫీల కోసం ఇది 50MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.
  • ఈ మొబైల్​లో అదనంగా కంపెనీ డ్యూయల్ రికార్డింగ్​ సౌకర్యాన్ని అందించింది.
  • అంటే ఒకే సమయంలో ఫ్రంట్ కమెరా అండ్ బ్యాక్ కెమెరాతో వీడియోలు రికార్డ్ చేయొచ్చు.
  • ఇది బ్లాగర్‌లకు బాగా ఉపయోగపడుతుంది.
  • దీంతోపాటు తక్కువ వెలుతురులో ఫోటోలు, వీడియోలను తీసేందుకు ఇందులో పాపులర్ నైటోగ్రఫీ ఫీచర్ కూడా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ M55s 5G ధర & సేల్ వివరాలు:

  • ఈ శాంసంగ్ గెలాక్సీ M55s 5G ఫోన్ అమెజాన్ ద్వారా ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయింది.
  • ఇది ధర రూ.19,999తో మార్కెట్లో లాంచ్ అయింది.
  • అమెజాన్ సేల్​లో బ్యాంకు ఆఫర్ ద్వారా దీనిపై రూ.2000 డిస్కౌంట్ పొందవచ్చు.
  • అంటే ఆఫర్​లో ఈ ఫోన్​ని రూ.17,999కి కొనుగోలు చేయవచ్చు.
  • Amazon, Samsung.comతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు.
  • సెప్టెంబర్ 26 నుంచి ఈ సేల్స్ ప్రారంభం కానున్నాయి.

స్మార్ట్​ఫోన్లపై ఆఫర్లే.. ఆఫర్లు- వన్​ప్లస్, శాంసంగ్​ మొబైల్స్​పై అమెజాన్ డీల్స్ ఇవే! - Amazon Offers on Smartphones

మారుతీ సుజుకీ సరికొత్త స్విఫ్ట్‌ లాంచ్- కిలో సీఎన్‌జీకి 32.85 కి.మీ మైలేజ్‌ - Maruti Suzuki Swift CNG Launched

ABOUT THE AUTHOR

...view details