Samsung Galaxy M05 Launched: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ఫోన్ల సేల్స్ పెరగటంతో ప్రముఖ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. అయితే ఇండియాలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకుని సేల్స్ పెంచుకోవటంపై స్మార్ట్ఫోన్ల కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ మరో సరికొత్త మొబైల్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం05 పేరుతో అతి తక్కువ ధరలో దీన్ని తీసుకొచ్చింది. రెండేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా ఈ మొబైల్‌ను కొనుగోలు చేయొచ్చు. మరెందుకు ఆలస్యం ఈ మొబైల్ ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేయండి.
Samsung Galaxy M05 Features:
- డిస్ప్లే: 6.74 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ
- బ్యాటరీ:5,000mAh
- ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85
- మెయిన్ కెమెరా: 50ఎంపీ
- ఫ్రంట్ కెమెరా:8ఎంపీ
- 25W ఫాస్ట్ ఛార్జింగ్
- ఛార్జర్:యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్
- డ్యూయల్ నానో సిమ్‌కు సపోర్ట్
శాంసంగ్ గెలాక్సీ M05 వేరియంట్స్: శాంసంగ్ కొత్త ఫోన్ ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.
- 4జీబీ+ 64జీబీ వేరియంట్