తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌- రూ.9,999లకే శాంసంగ్ మొబైల్! - Flipkart Offers on Samsung mobiles - FLIPKART OFFERS ON SAMSUNG MOBILES

Flipkart Offers on Samsung mobiles: మీరు ఈ పండగకి స్మార్ట్​ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్. శాంసంగ్ మొబైల్స్​పై ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. కేవలం 9,999 రూపాయలకే శాంసంగ్ గెలాక్సీ A14 5G మొబైల్​ను అందిస్తుంది.

Flipkart Offers on Samsung mobiles
Flipkart Offers on Samsung mobiles (Samsung)

By ETV Bharat Tech Team

Published : Sep 24, 2024, 7:32 PM IST

Flipkart Offers on Samsung mobiles: ఫ్లిప్​కార్ట్ తన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌లలో ఒకటైన బిగ్​ బిలియన్ డేస్​లో భాగంగా శాంసంగ్ మొబైల్స్​పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన శాంసంగ్ గెలాక్సీ A14 5G మొబైల్​ను ఈ సేల్​లో కేవలం రూ. 9999కి కొనుగోలు చేయొచ్చు. సెప్టెంబర్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమవుతాయి. ఈ సేల్​లో శాంసంగ్ మొబైల్స్​పై ఈ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ A14 5G ఫీచర్లు:స్మార్ట్​ఫోన్​లోసిగ్నేచర్ ఫ్లోటింగ్ కెమెరా డిజైన్​తో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియల్ కెమెరా ఉంది. దీంతోపాటు డెప్త్ మాక్రో లెన్స్, 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే, హై క్వాలిటీ ఫోటోల కోసం డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

వాయిస్ ఫోకస్ ఫీచర్: ఈ శాంసంగ్ గెలాక్సీ A14 5G కూడా శాంసంగ్ ప్రత్యేకమైన వాయిస్​ ఫీచర్​ను కలిగి ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తొలగించి కాల్స్ మాట్లాడుతున్న సమయంలో వాయిస్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. దీంతో రైళ్లు, బస్సులు, రద్దీ ప్రదేశాల్లో ఫోన్‌లో నాయిస్‌ లేకుండా క్లియర్​గా మాట్లాడుకోవచ్చు. ఇది Google Meet, Microsoft Teams, WhatsApp, Zoom వంటి వీడియో అండ్ వాయిస్ కాలింగ్ యాప్‌లతో కూడా పని చేస్తుంది.

కలర్ ఆప్షన్స్:శాంసంగ్ గెలాక్సీ A14 5G స్మార్ట్​ఫోన్ డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది Exynos 1330 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్-లీడింగ్ గీక్‌బెంచ్ స్కోర్‌లను అందిస్తుంది. ఇది మొబైల్​ను ఉపయోగించడంలో సున్నితమైన, సులభమైన అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6GB RAM ప్లస్ 6GB RAM ప్లస్ ఉంది. దీంతో మీరు ఒకే సమయంలో ఎక్కువ యాప్స్​ను ఉపయోగించొచ్చు.

4 GB + 128 GB వేరియంట్ ధర:

  • ఈ ఫోన్ బేసిక్ ధర 17,499 రూపాయలు.
  • అయితే ఫ్లిప్​కార్ట్ ఆఫర్​లో 4 GB + 128 GB వేరియంట్​లో ఈ మొబైల్​ను కేవలం 9,999లకే కొనుగోలు చేయొచ్చు.
  • ఈ డీల్​లో 6,500 రూపాయల రెగ్యులర్ డిస్కౌంట్​తో పాటు 1,000 రూపాయల క్విక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

6GB + 128 GB వేరియంట్ ధర:

  • ఈ ఫోన్ బేసిక్ ధర 20,999 రూపాయలు.
  • అయితే ఫ్లిప్​కార్ట్ ఆఫర్​లో దీన్ని కేవలం 10,999 రూపాయలకే కొనుగోలు చేయొచ్చు.
  • అంటే ఈ డీల్​లో 9,000 రూపాయల రెగ్యులర్ డిస్కౌంట్​తో పాటు 1,000 రూపాయల క్విక్ డిస్కౌంట్ పొందొచ్చు.

మారుతీ సుజుకీ సరికొత్త స్విఫ్ట్‌ లాంచ్- కిలో సీఎన్‌జీకి 32.85 కి.మీ మైలేజ్‌ - Maruti Suzuki Swift CNG Launched

స్మార్ట్​ఫోన్ ప్రియులకు ఆఫర్ల పండగ- వన్​ప్లస్​ దీపావళి డీల్స్​ రివీల్ - One Plus Diwali Sale 2024

ABOUT THE AUTHOR

...view details