Samsung Fab Grab Fest Sale: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు శాంసంగ్ గుడ్ న్యూస్ తెచ్చింది. ఈ పండగ వేళల్లో ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్టివల్ సేల్కు సిద్ధమైంది. ఈ సేల్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, గెలాక్సీ బుక్, ట్యాబ్, టీవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి ఈ సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్లు ఎన్నిరోజుల పాటు అందుబాటులో ఉంటాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై గరిష్ఠంగా 53శాతం వరకు రాయితీ పొందొచ్చని శాంసంగ్ పేర్కొంది.
ఈ ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయంటే?:
- శాంసంగ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్‌క్లూజీవ్ స్టోర్లలో కొనుగోలు చేసిన వారు మాత్రమే ఈ ఆఫర్లను పొందగలరు.
- ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, వేరియబుల్స్, లాప్‌ట్యాప్‌లను ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 40శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
- వీటితో పాటు శాంసంగ్ స్మార్ట్‌టీవీలపై 22.5శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
- ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐతో పాటు ఎంపిక చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు ఈ ఆఫర్ పొందొచ్చు.
- గెలాక్సీ బుక్4 సిరీస్‌పై 27శాతం తగ్గింపు అందిచనుంది.
- గెలాక్సీ బుక్ 4 మోడల్ కొనుగోలు చేసిన కస్టమర్లకు హెచ్‌డీ ఫ్లాట్ మానిటర్‌పై రూ.1,920 తగ్గింపు ఇవ్వనుంది.
- ఇక గెలాక్సీ ట్యాబ్ ఏ9, ఎస్9 సిరీస్‌లపై శాంసంగ్ గరిష్ఠంగా 74శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.