Royal Enfield Hunter 350:ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన రెట్రో-స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ 'హంటర్ 350' అరుదైన ఘనత సాధించింది. అత్యధికంగా సేల్స్‌ను రాబట్టి కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మోటార్ సైకిల్ ఏకంగా 5 లక్షల యూనిట్ల సేల్స్‌ను దాటి రికార్డ్ సృష్టించింది.
కంపెనీ ఈ మోటార్ సైకిల్‌ను ఆగస్టు 2022లో భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఇది అత్యధిక ప్రజాదరణతో మంచి సేల్స్‌తో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 2023లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 'హంటర్ 350' 1 లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. ఆ తర్వాతి ఐదు నెలల్లో ఇది మరో 1 లక్ష యూనిట్ల మార్కును దాటింది. ఈ సేల్స్‌తో ప్రారంభించినప్పటి నుంచి ఈ మోటార్ సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్ సైకిళ్లలో ఒకటిగా నిలిచింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర: భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీంతో ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన మోటార్‌సైకిల్‌గా మారడం గమనించదగ్గ విషయం.
భారత మార్కెట్‌తో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అర్జెంటీనా, కొలంబియాలో కూడా అమ్ముడవుతోంది. వీటితోపాటు ఈ మోటార్ సైకిల్ మెక్సికో, ఆస్ట్రేలియా, బ్రెజిల్, న్యూజిలాండ్‌లో కూడా సేల్ అవుతోంది.
పవర్‌ట్రెయిన్:దీని పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే ఈ మోటార్‌సైకిల్ 'క్లాసిక్ 350', 'మీటియోర్ 350' మోడల్స్‌లో ఉన్న ఇంజిన్‌నే కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ అదే 349cc ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. అయితే 'హంటర్ 350' ఫీచర్లకు అనుగుణంగా దీన్ని మరింత షార్ప్, రెస్పాన్సివ్‌గా ట్యూన్ చేశారు.