Reliance Jio welcome plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో న్యూ ఇయర్ కానుకగా అదిరే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ రీఛార్జి ప్లాన్‌తో ఖర్చు కంటే ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ సందర్భంగా ఏంటీ న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్? దీని ధర ఎంత? బెనిఫిట్స్ ఏంటి? ఈ ప్లాన్‌తో ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు? ఈ ప్లాన్ అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది? అనే వివరాలు మీకోసం.
ఏంటీ న్యూ ఇయర్ వెల్కమ్ ఆఫర్ ప్లాన్?: జియో ప్రతీ ఏడాది నూతన సంవత్సరానికి ముందుగా వినియోగదారులకు వెల్కమ్ ప్లాన్‌ను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా 'న్యూ ఇయర్ వెల్కమ్ ఆఫర్ ప్లాన్ 2025'ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ మెసెజెస్తో పాటు షాపింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్న వారికి 2,150 రూపాయల విలువైన షాపింగ్ వోచర్లు, కూపన్స్‌ను అందిస్తోంది.
ఈ ప్లాన్ ధర ఎంత?:
- ఈ జియో న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ ధర కేవలం రూ.2025 మాత్రమే.
రీఛార్జ్ బెనిఫిట్స్ ఇవే!:
- వినియోగదారులు 2025 రూపాయల విలువైన ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ 5G ఇంటర్నెట్ అన్లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు.
- అయితే 4G కనెక్షన్ ద్వారా రోజుకు 2.5GB చొప్పున 500GB డేటా లభిస్తుంది. అంతేకాక దీంతోపాటు రోజుకు 100 SMSలు పొందొచ్చు.
ఈ ప్లాన్‌తో ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు?:
- పైన చెప్పిన ఇవే ప్రయోజనాలతో వస్తున్న జియోనెలవారీ ప్లాన్‌తో పోలిస్తే ఈ 'న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్' ద్వారా రూ.468 ఆదా చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
- ప్రస్తుతం జియో నెలవారీ రూ.349 ప్లాన్‌తోనూ ఇవే ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్‌ను 200 రోజులకు లెక్కిస్తే.. దీని విలువ రూ.2,493 అవుతుంది.
- అంటే ఈ నెలవారీ ప్లాన్‌తో పోలిస్తే.. 'న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్' ద్వారా వినియోగదారులు రూ.468 ఆదా చేసుకోవచ్చు.