తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్​న్యూస్- ఇకపై ఆ ఫోన్​లకు 8 ఏళ్ల పాటు OS, సెక్యూరిటీ అప్​డేట్స్! - ANDROID PHONES 8 YEARS OS UPDATES

క్వాల్​కామ్, గూగుల్ భాగస్వామ్యం- ఏకంగా ఎనిమిదేళ్ల ఓఎస్​ అప్​డేట్స్​తో ఈ యూజర్లకు ఇక పండగే!

Qualcomm and Google Partner to Offer 8 Years of Android Updates for Snapdragon 8 Elite Devices
Qualcomm and Google Partner to Offer 8 Years of Android Updates for Snapdragon 8 Elite Devices (Photo Credit- Qualcomm)

By ETV Bharat Tech Team

Published : Feb 25, 2025, 3:45 PM IST

Android Smartphones 8 Years OS Updates:ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ వాడకం అనివార్యం అయిపోయింది. దీంతో మార్కెట్లో వీటి సేల్స్ విపరీతంగా జోరందుకున్నాయి. అయితే ​ఫోన్​ను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు దాని స్పెసిఫికేషన్​లతో పాటు సాఫ్ట్​వేర్ అప్​డేట్​లను కూడా చూస్తారు. ఎందుకంటే ప్రతిఒక్కరూ తమ ఫోన్ ఎక్కువ కాలం ఉపయోగించేలా ఉండాలని కోరుకుంటారు.

ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కొత్త ఫోన్​ను కొనేందుకు ముందుగా దానితోపాటు కంపెనీ ఎన్ని సంవత్సరాల OS, సెక్యూరిటీ అప్​డేట్స్​ను అందిస్తుందో చెక్ చేస్తారు. దీనికి కారణం ఈ అప్​డేట్స్​ లేకుండా ఫోన్లు సరిగ్గా పనిచేయవు. అంటే స్మార్ట్‌ఫోన్‌ను సురక్షితంగా, సరైన పద్ధతిలో ఉపయోగించేందుకు OS అండ్ సెక్యూరిటీ అప్​డేట్స్​ అవసరం.

దీంతో గత కొన్నేళ్లుగా స్మార్ట్​ఫోన్​లకు సాఫ్ట్​వేర్ సపోర్ట్ మరింతగా ఇంప్రూవ్ అయిందనే చెప్పొచ్చు. అనేక బ్రాండ్స్ 2 సంవత్సరాల కంటే ఎక్కువ అప్​డేట్​లను అందిస్తున్నాయి. ఇక శాంసంగ్, గూగుల్ సంస్థలు అయితే తమ ఫాగ్​షిప్​ ఫోన్​లకు అంటే 'గెలాక్సీ S24', 'పిక్సెల్ 8 సిరీస్‌'లకు గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పాలసీని ప్రకటించి మరో అడుగు ముందుకు వేశాయి. వీటి సక్సెసర్​ల విషయంలో కూడా ఇదే పరిస్థితి.

అయితే ఇప్పుడు ఏకంగా 8 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ అప్​డేట్​లను అందించేందుకు గూగుల్, క్వాల్​కామ్​ సంస్థలు రెడీ అయ్యాయి. ఇందుకోసం క్వాల్​కామ్, గూగుల్ కంపెనీలు జతకట్టాయి. దీంతో ఇకపై వినియోగదారులు ఎటువంటి కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లను కోల్పోకుండా తమ ఫోన్‌లను ఎక్కువ కాలం ఉపయోగించొచ్చు.

ఈ మేరకు పవర్​ఫుల్ చిప్​సెట్ తయారీ సంస్థ క్వాల్​కామ్.. గూగుల్​ భాగస్వామ్యంలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లు 8 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్​డేట్​లను పొందుతూనే ఉంటాయి. అంటే ఈ ప్రోగ్రామ్​తో మొదట ప్రయోజనం పొందేది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉన్న స్మార్ట్​ఫోన్‌లు. ఇవి ఆండ్రాయిడ్ 15 OSతో రన్​ అవుతాయి.

క్వాల్​కామ్, గూగుల్ భాగస్వామ్యంలో ఎనిమిదేళ్ల వరకు సాఫ్ట్​వేర్ సపోర్ట్:

  • ఈ కొత్త ప్రోగ్రామ్ ప్రకారం.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఆధారితమైన ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అయ్యే డివైజ్​లు ఈ 8 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు ఎలిజిబుల్ అయ్యే మొదటి పరికరాలు.
  • అయితే దీనర్థం 'వన్​ప్లస్ 13', 'ఐకూ 13' వంటి మరిన్ని ఫోన్​లు ఈ అప్​డేట్స్​ను రిసీవ్ చేసుకుంటాయని కాదు.
  • ఈ 8 సంవత్సరాల ఫుల్ అప్​డేట్స్​ అనేవి అమలు చేయాలా వద్దా అనే దానిపై ఫైనల్ డెసిషన్ వాటి తయారీ సంస్థలపై ఆధారపడి ఉంటుంది.
  • కొన్ని కంపెనీలు ఈ స్నాప్‌డ్రాగన్ 8, 7-సిరీస్ చిప్‌సెట్‌లతో తమ ఫోన్‌లలో ఈ అప్​డేట్స్​ను అందిస్తాయి. కొన్ని అందించవు. ఈ కారణంగా ఈ చిప్‌సెట్‌లు ఉన్న ప్రతి ఫోన్‌కు 8 సంవత్సరాల పాటు అప్​డేట్స్ వస్తాయో లేదో చెప్పలేము.
  • క్వాల్​కామ్ సంస్థ సపోర్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తోంది. ఈ చిప్‌మేకర్ దాని అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు (ASICలు), OEM నుంచి ఎటువంటి పెద్ద మార్పులు అవసరం లేని గూగుల్ ప్రాజెక్ట్ ట్రెబుల్‌ను ఉపయోగించుకోవడంతో ఈ ప్రోగ్రామ్ సాధ్యమవుతుంది.
  • క్వాల్​కామ్.. ఎనిమిదేళ్ల విండో సపోర్ట్ కోసం మొబైల్ ప్లాట్‌ఫామ్ ACK (ఆండ్రాయిడ్ కామన్ కెర్నల్ )కు రెండు అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.
  • ఈ ఏడాది చివర్లో కొత్త స్నాప్‌డ్రాగన్ 8, 7-సిరీస్ ప్రాసెసర్‌లతో లాంఛ్ అయ్యే ఫోన్‌లు ఈ ఎక్స్​టెండెడ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌కు అర్హత పొందుతాయని క్వాల్​కామ్ వెల్లడించింది.
  • ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ప్రోగ్రామ్ నెక్స్ట్​ ఐదు జనరేషన్​ల క్వాల్​కామ్ చిప్‌లకు కూడా విస్తరిస్తుంది.
  • అయితే పాత స్నాప్‌డ్రాగన్ ప్లాట్‌ఫామ్‌లు 8 సంవత్సరాల OS అప్​డేట్స్​ను రిసీవ్ చేసుకునేందుకు ఎలిజిబుల్ కాదు.

ఈ ఎక్స్​టెండెడ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌.. OEM (Original Equipment Manufacturer)లు, కన్జ్యూమర్స్​కు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అప్​డేట్​ ప్రాసెస్​ను సులభతరం చేస్తుంది. అంతేకాక ఇది పొటెన్షియల్ ఖర్చులను తగ్గించడంతో పాటు డివైజ్​ల లైఫ్​టైమ్​ను పొడిగిస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్​తో నథింగ్ ఫోన్ 3a సిరీస్- డిజైన్ కూడా రివీల్- టీజర్​ చూశారా?

M4 చిప్‌తో యాపిల్​ మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్- రిలీజ్ ఎప్పుడంటే?

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా?- అయితే కాస్త ఆగండి- త్వరలో కిర్రాక్ మోడల్స్​ లాంఛ్!

ABOUT THE AUTHOR

...view details