తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఓపెన్‌ ఏఐ సీటీవో మిరా మురాటి రాజీనామా- ఎందుకో తెలుసా? - OpenAI CTO Mira Murati Resigns - OPENAI CTO MIRA MURATI RESIGNS

OpenAI CTO Mira Murati Resigns: ఓపెన్‌ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటి తన రాజీనామాను ప్రకటించారు. తన వ్యక్తిగత లక్ష్యాలు, తన కోసం తాను సమయం వెచ్చించటం కోసం తాను కంపెనీని విడిచిపెడుతున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

OpenAI CTO Mira Murati Resigns
OpenAI CTO Mira Murati Resigns (Mira Murati 'X' Account)

By ETV Bharat Tech Team

Published : Sep 26, 2024, 5:28 PM IST

Updated : Sep 26, 2024, 5:34 PM IST

OpenAI CTO Mira Murati Resigns: ఓపెన్‌ ఏఐలో కీలకంగా పని చేసిన మిరా మురాటి రాజీనామా ప్రకటించారు. ఏఐ రంగంలో పెద్ద ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంలో ఫేమస్ అయిన ఆమె సుమారు ఆరున్నర సంవత్సరాలు ఓపెన్‌ ఏఐలో పనిచేశారు. అయితే ప్రస్తుతం రాజీనామా చేసిన ఆమె తన కోసం మరింత సమయం కేటాయించడం కోసం, తన గురించి తాను మరింత తెలుసుకోవడం కోసం రిజైన్‌ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సోషల్‌ మీడియాలో లెటర్:

  • చాట్‌జీపీటీని కంపెనీలో కీలకంగా మార్చడంలో, దానిని ముందుకు తీసుకెళ్లడంలో మిరా మురాటి ప్రముఖ పాత్ర పోషించారు.
  • తన రాజీనామా భవిష్యత్‌ ప్రయాణం గురించి చెబుతూ మిరా మురాటి సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ పోస్ట్ చేశారు.
  • చాట్‌జీపీటీ ప్రాజెక్ట్‌ సహా కంపెనీతో తన ఆరున్నర సంవత్సరాలు చాలా బాగా గడిచాయని, అపూర్వమైన అధికారాలు లభించాయని అందులో పేర్కొంటూ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు.
  • ఒక గొప్ప సాంకేతిక సంస్థకు నాయకత్వం వహించడంలో తనపై విశ్వాసం ఉంచారంటూ సామ్ అండ్ గ్రెగ్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పారు.
Last Updated : Sep 26, 2024, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details