One Plus Diwali Sale 2024:వన్‌ప్లస్ 2024 దీపావళి ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది. వైడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై ఫెస్టివల్ డీల్స్‌ను కూడా వెల్లడించింది. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ నార్డ్ 4 మరిన్ని వంటి ఫోన్లలో భారీ తగ్గింపు ఆఫర్‌లతో లభిస్తాయని కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ 12 మోడల్‌ను బట్టి కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ. 7000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్స్‌ను పొందొచ్చు.
ఈ సేల్ ఎప్పటి నుంచంటే?:వన్‌ప్లస్ 2024 దీపావళి ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. దీపావళి సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంకుల కార్డ్‌లపై కూడా మంచి ఆఫర్‌లను పొందొచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌తో సహా వన్‌ప్లస్ స్టోర్‌లలో ఈ మొబైల్స్‌ను కొనుగోలు చేయొచ్చు. అమెజాన్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లు సింగిల్ వన్‌ప్లస్ ఫోన్ డీల్స్ అందిస్తున్నాయి.
వన్‌ప్లస్ 12 ఆఫర్స్: కస్టమర్లు సెప్టెంబర్ 26 నుంచి మంచి ఆఫర్‌తో వన్‌ప్లస్ 12ని కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ సెట్‌ను ఉచితంగా పొందొచ్చు. వన్‌ప్లస్ 12ని కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లతో రూ. 7000 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్స్‌ను పొందొచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో- కాస్ట్ EMIని పొందొచ్చు.
వన్‌ప్లస్ 12R: వన్‌ప్లస్ 12ఆర్‌పై డీల్స్ కోసం చూస్తున్న కొనుగోలుదారులు రూ. 3వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా పొందొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5జీ:మార్కెట్లో ఇటీవలే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ అయింది. దీని ధర 1,39,999 ఉండగా.. ఈ సేల్‌లో దీనిపై రూ. 2వేల వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.