Ola Roadster X and X+ Launched:ప్రముఖ విద్యుత్ టూ-వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నుంచి రెండు ఇ-మోటార్‌సైకిల్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ 'రోడ్స్ట్ర్ X', 'రోడ్‌స్టర్ X+' పేరుతో ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ బుకింగ్స్‌ను ఇవాళ ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయిస్తున్న సంస్థ ఇప్పుడు ఈవీ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వీటి రేంజ్, ధర, ఫీచర్ల వివరాలు మీకోసం.
'ఓలా రోడ్‌స్టర్ X' బ్యాటరీ అండ్ పవర్ ట్రెయిన్:ఈ కొత్త 'ఓలా రోడ్‌స్టర్ X' ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మూడు బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
- 2.5 kWh
- 3.5 kWh
- 4.5 kWh
ఇవి 9.38 HP గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
దీని 2.5 kWh బ్యాటరీ వేరియంట్ 105 km/h టాప్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో 0 - 40 km/h వేగాన్ని అందుకుంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సమాచారం.
ఇక దీని 3.5 kWh, 4.5 kWh రెండు బ్యాటరీ వేరియంట్‌లూ 118 km/h గరిష్ఠ వేగాన్ని అందిస్తాయి. ఇవి కేవలం 3.1 సెకన్లలో దీన్ని పూర్తి చేస్తాయి. వీటిలో 3.5 kWh బ్యాటరీ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌తో 196 కి.మీ, 4.5 kWh బ్యాటరీ వేరియంట్ 252 కి.మీ చొప్పున రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది.
'ఓలా రోడ్‌స్టర్ X+' బ్యాటరీ అండ్ పవర్ ట్రెయిన్:ఈ 'ఓలా రోడ్‌స్టర్ X+' ఇ-మోటార్‌సైకిల్ రెండు బ్యాటరీ వేరియంట్లను కలిగి ఉంది. ఇవి గరిష్ఠంగా 14.75 HP పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ బైక్ టాప్ స్పీడ్ 125 km/h. ఇది కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 40 km/h వేగాన్ని అందుకుంటుంది.
- 4.5 kWh
- 9.1 kWh
ఇక ఓలా రోడ్‌స్టర్ X+ మోడల్ 4.5 kWh బ్యాటరీ వేరియంట్ 252 కి.మీ రేంజ్, 9.1 kWh బ్యాటరీ వేరియంట్ 501 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని ఓలా చెబుతోంది.
ఓలా రోడ్‌స్టర్ X అండ్ రోడ్‌స్టర్ X+ ఫీచర్లు: