Ola Electric Roadster X Bike:మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లేటెస్ట్ బైక్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఇది ఫిబ్రవరి 5, 2025 అంటే రేపటి నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనుంది. ఇప్పటి వరకూ విద్యుత్ స్కూటర్లను మాత్రమే విక్రయిస్తున్న కంపెనీ నుంచి వస్తున్న మొదటి స్కూటర్ ఇదే. రోడ్‌స్టర్ పేరిట కంపెనీ ఈ సిరీస్‌లో మూడు బైక్‌లను గతేడాది ఆగస్టులో గ్లోబల్‌గా లాంఛ్ చేసింది. వాటి ధరల వివరాలను కూడా వెల్లడించింది. ఇప్పుడు తాజాగా కంపెనీ ఈ సిరీస్‌లోని ఒక బైక్ సేల్స్‌ను ప్రారంభించనుంది.
ఈ మేరకుఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త బైక్ సేల్స్‌ను రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' వేదికగా పోస్ట్ చేసింది. అందులో రోడ్‌స్టర్ ఎక్స్ గేమ్‌ను ఛేంజ్ చేసేందుకు రెడీగా ఉందని రాసుకొస్తూ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ సేల్స్ ప్రారంభ సమయాన్ని కూడా వెల్లడించింది. ఫిబ్రవరి 5న ఉదయం 10:30 గంటలకు ఈ బైక్ సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్‌తో పాటు ఒక వీడియోను జోడించిన కంపెనీ ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయొచ్చని ఓ లింక్‌ను కూడా అందించింది.
రోడ్‌స్టర్ ఎక్స్:రోడ్‌స్టర్ సిరీస్‌లో అందుబాటు ధరలో లభించే వేరియంట్ ఇది. కంపెనీ ఈ బైక్‌ను మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకొచ్చింది.
రోడ్‌స్టర్ ఎక్స్ బ్యాటరీ ఆప్షన్స్:
- 2.5 kWh బ్యాటరీ
- 3.5 kWh బ్యాటరీ
- 4.5 kWh బ్యాటరీ