Nothing 2a Plus Community Edition: పండగ వేళ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. నథింగ్ కంపెనీ తన '2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్'ను లాంచ్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ 1,000 యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి నవంబర్ 12న మొదట వచ్చిన వారు మాత్రమే కొనుగోలు చేయగలరని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ nothing.tech లో మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా నథింగ్ 2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
నథింగ్ 2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ఫీచర్స్:
- డిస్ప్లే: 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్
- రిఫ్రెష్ రేటు:120Hz
- పీక్ బ్రైట్నెస్: 1,300 నిట్స్
- చిప్‌సెట్: 4nm MediaTek Dimensity 7350 Pro 5G
- బ్యాటరీ:5,000mAh
- 50W ఫాస్ట్ ఛార్జింగ్
- డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
- IP54 రేటింగ్
- ప్రైమరీ సెన్సార్: 50MP
నథింగ్ 2a ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ప్రత్యేకతలు:ఈ కొత్త నథింగ్ స్మార్ట్‌ఫోన్ గ్రీన్-ఫాస్ఫోరేసెంట్ మెటీరియల్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇది చీకట్లో ఫోన్‌ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాక ఇది కేబుల్స్, పైపులు, మైక్రోచిప్స్, కాంపోనెంట్స్‌తో ఆరు వాల్‌పేపర్స్‌ను కలిగి ఉంటుంది. మొబైల్ 4nm MediaTek Dimensity 7350 Pro 5G చిప్సెట్తో వస్తుంది. ఇది Mali-G610 MC4 GPUతో గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజీని కలిగి ఉంటుంది.