New 2024 Yamaha R15M Launched:మార్కెట్లోకి యమహా మోటార్ న్యూ R15M బైక్ రిలీజ్ అయింది. అదిరిపోయే కొత్త ఫీచర్లతో స్టైలిష్ లుక్‌లో దీన్ని డిజైన్ చేశారు. దీన్ని న్యూ కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లు గురించి మరిన్ని వివరాలు మీకోసం.
Yamaha R15M Features: యమహా న్యూ R15M బైక్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. దీనిలో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని Y-కనెక్ట్ అప్లికేషన్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్, iOS.. App Store వంటి ఆండ్రాయిడ్ డివైజెస్‌లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను కనెక్ట్ చేసేందుకు రైడర్ స్మార్ట్‌ఫోన్‌లో అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ మోడల్ బైక్‌లో మెరుగైన స్విచ్ గేర్, కొత్తగా రూపొందించిన ఎల్ఈడీ లైసెన్స్ ప్లేట్ లైట్ ఉంది.
- ఇంజిన్ టైప్:లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, 4-వాల్వ్
- కంప్రెషన్ రేషియో:11.6 : 1
- క్లచ్ టైప్: వెట్, మల్టిపుల్ డిస్క్
- మాగ్జిమమ్ టార్క్:14.2 Nm (1.4 kgfm) @7,500 RPM
- డిస్ప్లేస్మెంట్: 155 CC
- మాగ్జిమమ్ హార్స్ పవర్: 13.5kW(18.4PS)/10000 RPM
- ట్రాన్స్మిషన్ టైప్:
- ఫ్యూయల్ సిస్టమ్:ఫ్యూయల్ ఇంజక్షన్
- బోర్ అండ్ స్ట్రోక్:58.0 mm × 58.7 mm
- స్టార్టింగ్ సిస్టమ్ టైప్: ఎలక్ట్రిక్ స్టార్టర్
- E20 Compatible
- టర్న్-బై-టర్న్ నావిగేషన్
- మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్
కలర్ ఆప్షన్స్: ఈ బైక్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- మెటాలిక్ గ్రే
- కార్బన్ ఫైబర్ ప్యాటర్న్
- కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ కాకుండా ఈ R15M బైక్‌కు ఆల్-బ్లాక్ ఫెండర్, ట్యాంక్‌పై కొత్త డీకాల్స్, సైడ్ ఫెయిరింగ్ అలాగే బ్లూ వీల్స్ కూడా ఉన్నాయి.