MrBeast Overtakes T-Series :ప్రపంచంలోనే అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్ (MrBeast) ఎదిగింది. భారత మ్యూజిక్ కంపెనీ ‘టీ-సిరీస్’ను (T-Series) వెనక్కి నెట్టి మరీ ఈ ఘనతను సాధించింది. ఈ విషయాన్ని మిస్టర్‌బీస్ట్ ఛానల్‌ను నిర్వహిస్తున్న, అమెరికాకు చెందిన జేమ్స్ స్టీఫెన్ డోనాల్డ్‌సన్ తమ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ ద్వారా వెల్లడించారు.
గ్యాప్ తక్కువే!
మిస్టర్‌బీస్ట్‌కు ప్రస్తుతం 26.6 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టీ-సిరీస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య దానికంటే కేవలం 1,608 మాత్రమే తక్కువ. ఈ సబ్స్క్రైబర్స్ నంబర్స్‌ను పోలుస్తూ మిస్టర్‌బీస్ట్ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే 12 మిలియన్లకు పైగా వ్యూస్, 10 వేలకు పైగా లైక్స్ రావడం విశేషం.
మస్క్ అభినందనలు
బిలియనీర్ ఎలాన్ మస్క్ సైతం మిస్టర్ బీస్ట్‌ను అభినందిస్తూ పోస్ట్ చేశారు. 2024 ఏప్రిల్‌లోనే మిస్టర్‌బీస్ట్ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 25 కోట్లు దాటింది. దీంతో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఛానల్‌గా నిలిచింది.
టీ-సిరీస్ ప్రస్థానం
2019 నుంచి ఇప్పటి వరకు టీ-సిరీస్ అత్యధిక మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్‌గా కొనసాగింది. స్వీడన్‌కు చెందిన 'ప్యూడైపై'ను వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే 2023లో ఓసారి ప్యూడైపైనకు మిస్టర్‌బీస్ట్ మద్దతుగా నిలిచారు. తాజాగా టీ-సిరీస్‌ను ఆయన ఛానల్ దాటేయటంతో, ప్యూడైపై ప్రతీకారాన్ని, తాను తీర్చుకున్నానంటూ ఓ పోస్ట్ పెట్టాడు.
2023లోనూ అత్యధికంగా డబ్బు సంపాదించిన యూట్యూబ్ ఛానల్‌గా మిస్టర్‌బీస్ట్ నిలిచింది. సాహసాలు, వింతైన స్టంట్లూ చేస్తూ, డోనాల్డ్‌సన్ నడుపుతున్న ఈ ఛానల్ ఆదాయం దాదాపు రూ.680 కోట్లని ఒక అంచనా.
మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారా?
చూశారుగా! మరిమీరు కూడా మంచి కంటెంట్ క్రియేటర్‌గా, ఇన్ఫ్లూయెన్సర్గా పేరు సంపాదించాలని అనుకుంటున్నారా? సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్‌ను ప్రమోట్ చేయాలని ఆశిస్తున్నారా? అయితే మీకు యూట్యూబ్బెస్ట్ ప్లాట్‌ఫామ్ అవుతుంది. ప్రతి నెలా దాదాపు 2 బిలియన్ల మంది యూట్యూబ్‌ను చూస్తూ ఉంటారు. ఈ వీడియో-షేరింగ్ ప్లాట్ఫామ్లో విద్య, వినోదం రెండూ కలగలిసి ఉంటాయి. కనుక ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
యూట్యూబ్ ఛానల్ వల్ల కలిగే లాభాలు
- ప్రేక్షకుల ఆదరణ : యూట్యూబ్‌కు సరిహద్దులు అంటూ ఏమీ లేవు. కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిమానాన్ని మీరు సంపాదించవచ్చు.
- మోనటైజేషన్ : యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యాడ్స్, ఛానల్ మెంబర్షిప్స్, సూపర్ చాట్స్ ద్వారా; ప్రొడక్ట్స్ సేల్, అఫిలియేషన్ మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా సంపాదన పెంచుకోవచ్చు. సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్న కొలదీ మీ రెవెన్యూ కూడా పెరుగుతుంది.
- బ్రాండ్ బిల్డింగ్ : మీకంటూ ఒక బ్రాండింగ్‌ను సృష్టించుకోవడం వల్ల, సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ అనుభవం, వ్యక్తిత్వం, విలువలు గురించి ప్రజలకు తెలుస్తుంది.
- జ్ఞానం పంచుకోవడం : మీకు ఉన్న జ్ఞానాన్ని ట్యుటోరియల్స్ ద్వారా ప్రజలతో పంచుకోవచ్చు. దీని వల్ల చాలా మంది విజ్ఞానం, ప్రేరణ పొందుతారు.
YouTubeలో అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోకు ఎంత రెవెన్యూ వచ్చిందో తెలుసా? - The First Youtube Video
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగాలా? ఈ 10 సెట్టింగ్స్ మార్చుకోండి! - HOW TO BOOST PHONE BATTERY LIFE