Auto Expo 2025:లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా తన లగ్జరీ మేబ్యాక్ GLS 600 SUV, ఆల్-ఎలక్ట్రిక్ EQS 680 SUV నైట్ సిరీస్ వేరియంట్‌లను విడుదల చేసింది. మేబ్యాక్ GLS 600 నైట్ సిరీస్ ధర రూ. 3.71 కోట్లు కాగా, EQS 680 రూ. 2.63 కోట్లు (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభం అవుతుంది.
కంపెనీ ఈ రెండు కార్లను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లాంఛ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ SUVల స్టాండర్డ్ మోడల్స్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులను చేశారు. వీటి ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డార్క్ థీమ్‌తో వస్తున్నాయి.
మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 నైట్ సిరీస్:మేబ్యాక్ GLS 600 నైట్ సిరీస్ లైట్ కలర్స్, మినిమల్ క్రోమ్ ట్రిమ్‌తో చాలా సింపుల్ ఎక్స్టీరియర్తో వస్తుంది. ఈ SUVలో మేబ్యాక్ మోడళ్లలో కనిపించే సిగ్నేచర్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌ను అందించారు. పైభాగంలో మోజావే సిల్వర్, దిగువ భాగంలో ఒనిక్స్ బ్లాక్ పెయింట్ జాబ్ ఉన్నాయి.
దాని బ్లాక్-అవుట్ ఎక్స్టీరియర్ భాగాలలో గ్రిల్ ఉంది. హెడ్‌లైట్లు రోజ్ గోల్డ్ యాక్సెంట్‌లను కలిగి ఉన్నాయి. దీనికి 23-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దానిపై మేబ్యాక్ లోగో కూడా ఉంది. కారు ఎక్స్టీరియర్కి సరిపోయేలా దీని క్యాబిన్‌ను డార్క్ గ్రే కలర్లో అందించారు. కంపెనీ దానిలో మ్యానిఫ్యాక్చురర్ బ్లాక్ పెర్ల్ నప్పా లెదర్‌ను ఉపయోగించింది.
వీటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో ప్రత్యేక నైట్ సిరీస్ యానిమేషన్ కూడా కనిపిస్తుంది. మేబ్యాక్ GLS స్టాండర్డ్ ఫీచర్లను అలాగే ఉంచారు. వీటిలో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనక సీటు ట్విన్ 11.6-అంగుళాల డిస్ప్లే, 590-వాట్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
మేబ్యాక్ GLS 600 నైట్ సిరీస్ 550 bhp శక్తిని ఉత్పత్తి చేసే అదే 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్‌తో వస్తుంది. దీనికి జోడించిన ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) అదనంగా 22 bhp పవర్, 250 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఆల్-వీల్ డ్రైవ్‌తో వస్తుంది.