Maruti Suzuki Swift CNG Launched: ఇండియాలో అత్యధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఒకటి. ఈ మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను మారుతీ తాజాగా లాంచ్ చేసింది. అధిక ఇంధన సామర్థ్యంతో దీన్ని తీసుకొచ్చింది. కొత్త సీఎన్‌జీ రిలీజ్ అవ్వటంతో మారుతీ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 14 సీఎన్‌జీ మోడల్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లు, మైలేజీ గురించి తెలుసుకుందాం రండి.
పాత సీఎన్‌జీల కంటే మెరుగైన మైలేజ్:
- మారుతీ సుజుకీ ఈ కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.2 లీటర్ల జెడ్ సిరీస్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ అమర్చారు.
- ఇది 69.75పీఎస్ శక్తిని, 101.8ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ఈ వాహనాలు పాత సీఎన్‌జీల కంటే మెరుగైన మైలేజ్ అందిస్తాయని మారుతీ వెల్లడించింది.
- కిలో సీఎన్‌జీకి 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలిపింది.
సేఫ్టీ ఫీచర్లు:
- ఆరు ఎయిర్‌బ్యాగ్లు
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+
- హిల్ హోల్డ్ అసిస్టెంట్
అత్యాధునిక ఫీచర్లు:
- ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్
- రియర్ ఏసీ వెంట్
- వైర్‌లెస్ ఛార్జర్
- 60:40 స్పిల్ట్ రియర్ సీట్
- 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం
మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+, హిల్ హోల్డ్ అసిస్టెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, 60:40 స్పిల్ట్ రియర్ సీట్, 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కొత్త కారులో ఉన్నాయి.